1. సాధారణంగా స్మార్ట్‌ఫోన్ 100 శాతం ఛార్జింగ్ చేయాలంటే కనీసం గంట సమయం పడుతుంది. ఇటీవల ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అంతకన్నా తక్కువ సమయంలోనే స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయొచ్చు. షావోమీ లేటెస్ట్గా రిలీజ్ చేయబోయే షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 15 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయొచ్చని కంపెనీ ప్రకటించింది. (image: Xiaomi India)
2. షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్ జనవరి 6న ఇండియాలో రిలీజ్ కానుంది. ఇప్పటికే కొన్ని స్పెసిఫికేషన్స్‌ని రిలీజ్ చేసింది కంపెనీ. భారతదేశంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 120వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జింగ్ చేయొచ్చు. 100 శాతం ఛార్జ్ చేయడానికి 15 నిమిషాలు చాలు. (image: Xiaomi India)
3. షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 12 సిరీస్ లాగా ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌తో వస్తుంది. అక్టోబర్‌లో చైనాలో రిలీజ్ అయిన రెడ్మీ నోట్ 11 ప్రో+ మోడల్ లాగానే ఈ స్మార్ట్‌ఫోన్ ఉంది. రెడ్మీ నోట్ 11 ప్రో+ రీబ్రాండెడ్ వర్షన్‌ను ఇండియాలో షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్ పేరుతో రిలీజ్ చేస్తున్నారన్న వార్తలొస్తున్నాయి. (image: Xiaomi India)
4. ఇక షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్‌తో వివో నుంచి కూడా స్మార్ట్‌ఫోన్ రానుంది. ఇక షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌లో Dolby Atmos సౌండ్ ఫీచర్ కూడా ఉండటం విశేషం. (image: Xiaomi India)
5. షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. వెనుకవైపు ఉన్న మూడు కెమెరాల్లో ఒకటి 108 మెగాపిక్సెల్ కాగా, మిగతా రెండు సెన్సార్ల గురించి తెలియాల్సి ఉంది. ఇందులో సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పసిఫిక్ పెరల్, స్టీల్త్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తంది. (image: Xiaomi India)
6. షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్ రూ.25,000 నుంచి రూ.30,000 లోపు ఉండొచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు 120వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా బాక్సులోనే ఇవ్వనుంది షావోమీ. ఇంతకుముందు ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌కు 67వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నా కంపెనీ 55వాట్ ఛార్జర్ అందించిన సంగతి తెలిసిందే. (image: Xiaomi India)