1. షావోమీ ఇండియా గతవారం భారతదేశంలో మరో రెండు స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. షావోమీ 11ఐ (Xiaomi 11i), షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ (Xiaomi 11i HyperCharge) స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. (image: Xiaomi India)
2. షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 15 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. ఈ ఏడాది షావోమీ నుంచి వచ్చిన తొలి సిరీస్ ఇదే. గతేడాది రిలీజ్ అయిన ఎంఐ 10ఐ అప్‌గ్రేడ్ వర్షన్స్ ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్. ఇప్పటికే డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో వివో వీ23 (Vivo V23) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌కు షావోమీ 11ఐ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. (image: Xiaomi India)
3. షావోమీ 11ఐ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999. ఇక షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. (image: Xiaomi India)
4. ఈ రెండు స్మార్ట్ఫోన్ల సేల్ జనవరి 12న ప్రారంభం కానుంది. ఎస్బీఐ కార్డుతో కొనేవారికి రూ.2,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ ప్రకటించింది షావోమీ. ఫ్లిప్‌కార్ట్, షావోమీ వెబ్సైట్, ఎంఐ హోమ్ స్టోర్స్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనొచ్చు. షావోమీ 11ఐ, షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్ఫోన్లను కామో గ్రీన్, స్టీల్త్ బ్లాక్, పర్పుల్ మిస్ట్, పసిఫిక్ పెరల్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Xiaomi India)
5. షావోమీ 11ఐ, షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్ఫోన్ల స్పెసిఫికేషన్స్ ఒకేలా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటం విశేషం. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్ ఉండగా వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో మరో 3జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. 5జీ బ్యాండ్స్ సపోర్ట్ లభిస్తుంది. ఇందులో డ్యూయెల్ స్పీకర్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండటం విశేషం. (image: Xiaomi India)
6. షావోమీ 11ఐ స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ Samsung HM2 ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో 5,160ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. షావోమీ 11ఐ స్మార్ట్‌ఫోన్‌కు 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. (image: Xiaomi India)
7. షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 120వాట్ ఛార్జర్ బాక్సులోనే ఇస్తోంది షావోమీ. 120వాట్ హైపర్‌ఛార్జ్ అడాప్టర్‌ను వేరుగా కూడా అమ్ముతోంది షావోమీ. ధర రూ.3,999. కేవలం ఫాస్ట్ ఛార్జర్ కొనాలనుకునేవారు ఈ ఫాస్ట్ ఛార్జర్ కొనొచ్చు. (image: Xiaomi India)