1. షావోమీ ఇండియా ఇటీవల షావోమీ 11ఐ (Xiaomi 11i), షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ (Xiaomi 11i HyperCharge) స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ఉండటం విశేషం. వివో వీ23 (Vivo V23) స్మార్ట్‌ఫోన్‌లో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంది. మరి ఈ స్మార్ట్ఫోన్ల మధ్య తేడాలేంటీ? వీటిలో ఏది బెస్ట్? తెలుసుకోండి.
2. Price: షావోమీ 11ఐ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.26,999. ఇక షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.28,999. వివో వీ23 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.29,990 కాగా, 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.34,990.
4. Processor, RAM and Internal Storage: షావోమీ 11ఐ, షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్, వివో వీ23 స్మార్ట్ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్ఫోన్లు 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో మరో 3జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. ఇక వివో వీ23 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రిలీజైంది.
5. Camera: షావోమీ 11ఐ, షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్ఫోన్లలో 108 మెగాపిక్సెల్ Samsung HM2 ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. వివో వీ23 5జీ స్మార్ట్‌ఫోన్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం.
6. Battery: షావోమీ 11ఐ స్మార్ట్‌ఫోన్‌లో 5,160ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఇక షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఛార్జర్లు బాక్సులోనే లభిస్తాయి. 120వాట్ హైపర్‌ఛార్జ్ అడాప్టర్‌తో షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 15 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. వివో వీ23 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,200ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
8. Colors: షావోమీ 11ఐ, షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్ఫోన్లను కామో గ్రీన్, స్టీల్త్ బ్లాక్, పర్పుల్ మిస్ట్, పసిఫిక్ పెరల్ కలర్స్‌లో కొనొచ్చు. వివో వీ23 స్మార్ట్‌ఫోన్‌ను స్టార్‌డస్ట్ బ్లాక్, సన్‌షైన్ గోల్డ్ కలర్స్‌లో కొనొచ్చు. భారతదేశంలో మొదటి కలర్ ఛేంజింగ్ స్మార్ట్‌ఫోన్ ఇదే. సన్‌షైన్ గోల్డ్ కలర్లో వచ్చే మోడల్ వెనుక కలర్ ఛేంజింగ్ ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ ఉంటుంది.