1. కరోనా కారణంగా అన్ని రంగాలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటుపడ్డాయి. అయితే ఇటీవల దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో దిగ్గజ ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ తదితర సంస్థలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు పిలవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ మేరకు హైబ్రిడ్ మోడల్ వర్క్‌ను ఎంచుకోవాలని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఐటీ కంపెనీలు '25x25 మోడల్'ను స్వీకరించడానికి ఉద్యోగుల కోసం అకేషనల్ ఆపరేటింగ్ జోన్లు (OOZ), హాట్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది. ఈ మోడల్ ద్వారా కంపెనీ అసోసియేట్లలో 25 శాతం మంది ఏ సమయంలోనైనా ఆఫీస్ నుంచి పని చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే వారు ఆఫీస్‌ల్లో తమ సమయాన్ని 25 శాతానికి మించి కేటాయించాల్సిన అవసరం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. హైబ్రిడ్ వర్క్ మోడల్‌పై టీసీఎస్ ఇలా స్పందించింది. “రాబోయే నెలల్లో మా ఉద్యోగులు తిరిగి ఆఫీస్‌లకు వచ్చేలా కృషి చేస్తాం. ఇప్పటికే ఆ పనిని మొదలు పెట్టాం, సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు క్రమం తప్పకుండా ఆఫీస్ నుంచి పని చేయడం ప్రారంభించారు.’’ అని టీసీఎస్ తెలిపింది. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ కూడా హైబ్రిడ్ మోడల్‌కి మారుతున్నాయి. ఉద్యోగులను దశలవారీగా ఆఫీస్‌లకు తిరిగి పిలిపించాలని ప్లాన్ చేస్తున్నాయి. “మా వ్యాపార సాధారణ స్థితిని కొనసాగించడానికి, తద్వారా మా క్లయింట్లకు నిరంతరాయమైన సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నాం. ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తూనే హైబ్రిడ్ మోడల్లో పని చేయడం కొనసాగిస్తాం" అని హెచ్‌సిఎల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)