112 యాప్ (112 APP) - ఈ యాప్ ను కేంద్ర హోం శాఖ రూపొందించింది. 112 యాప్ తో అత్యవసర పరిస్థితుల్లో రక్షణ పొందొచ్చు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ను గుర్తించి ఈ యాప్ వాలంటీర్లకు సమాచారాన్ని అందిస్తుంది. వారు తక్షణమే మీకు సాయం అందజేస్తారు. మీరు కూడా ఈ యాప్ వాలంటీర్ గా నమోదు చేసుకుని అసరమైనవారికి హెల్ప్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
రక్ష (RAKSHA) - ఈ యాప్ మొబైల్ లో ఇన్ స్టాల్ అయ్యి ఉంటే కాస్త సేఫ్ గా ఫీలవ్వొచ్చు. ఎందుకంటే.. ఒక్క బటన్ నొక్కగానే.. యాప్ లో ముందుగానే సెలక్ట్ చేసుకున్న కాంటాక్ట్స్ కు మన వివరాలన్నీ చేరిపోతాయి. ఇంటర్నెట్ లేకపోయినా.. వాల్యూమ్ బటన్ మూడు సార్లు ప్రెస్ చేయగానే మీ సెలక్టెడ్ కాంటాక్ట్స్ కు లొకేషన్ తో సహా మీ వివరాలన్నీ తెలిసిపోతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
హాక్ ఐ (HAWK EYE) - తెలంగాణ పోలీసులు రూపొందించిన హాక్ ఐ యాప్ కూడా అత్యవసర సమయాల్లో మహిళలకు రక్షణగా నిలుస్తోంది. ప్రమాద సమయాల్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే.. మీ వివరాలు దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు, ఏసీపీకి, డీసీపీకి, పెట్రోలింగ్ వ్యాన్‌కు చేరిపోతాయి. వెంటనే వారు రంగంలోకి దిగి మీకు రక్షణ కల్పిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)