వాట్సప్ ఫీచర్స్, వాట్సప్ అకౌంట్ సేఫ్టీ, వాట్సప్ అకౌంట్ సెక్యూరిటీ, సెక్యూరిటీ ఫీచర్స్, వాట్సప్ టిప్స్" width="1200" height="800" /> 1. వాట్సప్‌లో పలు ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి వాట్సాప్ బీటా యూజర్లకు ఈ కొత్త ఫీచర్లను అందుబాటులో తెచ్చింది. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేకంగా గ్రూప్ వాయిస్ కాల్స్(Voice Calls) కోసం ఈ ఫీచర్‌ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఫార్వర్డ్ నోట్స్, ఆడియో ఫైల్స్ మధ్య తేడాలను గుర్తించడానికి వాట్సాప్ త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫార్వర్డ్ చేసిన వాయిస్ నోట్స్ ఇకపై నారింజ రంగులో కనిపించనున్నాయి. అలాగే, ఇతరులతో చాటింగ్ చేస్తున్న సమయంలో ఎమోజీని త్వరగా ఎంచుకోవడానికి వాట్సాప్ షార్ట్‌కట్‌లను అందుబాటులోకి తేనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఆండ్రాయిడ్ యాప్" width="875" height="583" /> 5. ఎవరిని పడితే వారిని యాడ్ చేయడం, అవతలివారి అనుమతి తీసుకోకుండా గ్రూప్‌లో చేర్చడం, గ్రూప్‌లో ఉన్న సభ్యులు ప్రవర్తించే తీరు... ఇలా చాలా చిక్కులు ఉన్నాయి. ఈ చిక్కులన్నీ చివరకు గ్రూప్ అడ్మిన్ మెడకు చుట్టుకుంటాయి. వాట్సప్ గ్రూప్‌లో సభ్యులు చేసే తప్పులకు అడ్మిన్ బాధ్యత వహించడం మాత్రమే కాదు... జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా రావొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. వాట్సప్ గ్రూప్‌లో ఈ తప్పులు జరిగితే వాట్సప్ అడ్మిన్ జైలుకు వెళ్లడం ఖాయం. వాట్సప్ గ్రూప్‌లో దేశ వ్యతిరేక సందేశాలు, ఫోటోలు, వీడియోలు షేర్ చేయకూడదు. గ్రూప్‌లో ఇలాంటివి షేర్ చేస్తే షేర్ చేసినవారితో పాటు గ్రూప్ అడ్మిన్‌ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఘటనలో 'యాంటీ నేషనల్' మెసేజెస్ షేర్ చేసినందుకు వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌ను అరెస్ట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. వాట్సప్‌లో సొంత ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం అలవాటే. వాట్సప్‌లో ఇతరుల అనుమతి లేకుండా వారి ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం కూడా తప్పే. దీనిపైనా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే హింసను రెచ్చగొట్టే మెసేజెస్ పంపొద్దు. వీడియోలు, ఫోటోలు షేర్ చేయకూడదు. ఎవరి విశ్వాసాలను అవమానించకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
8. మరోవైపు, వాట్సాప్ ఇటీవల తమ నిబంధనలను ఉల్లంఘించిన వారి అకౌంట్స్‌ను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అకౌంట్ బ్లాకింగ్ గురించి యూజర్లు రియాక్ట్ అవ్వడానికి వాట్సాప్ కొత్త స్క్రీన్ తీసుకొచ్చే యోచనలో ఉంది. వాట్సాప్ అతి త్వరలోనే 'కమ్యూనిటీ' ఫీచర్‌ను విడుదల చేయడానికి కూడా కృషి చేస్తోంది. కమ్యూనిటీ అనేది వాట్సాప్‌లో గ్రూప్ అడ్మిన్లకు మరింత నియంత్రణ ఇచ్చే ఫీచర్. ఇది గ్రూప్ చాట్ మాదిరిగానే పనిచేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)