ప్రస్తుతం మనుషులు ఇంటర్నెట్పై ఆధారపడే అంశాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోషల మీడియాలో సమాచారం క్షణాల్లో వైరల్ అవుతోంది. ప్రపంచ దేశాలు కొన్ని సందర్భాల్లో ఆందోళనలు, అసమ్మతిని అణిచివేసేందుకు ఇంటర్నెట్ షట్‌డౌన్‌ను శక్తివంతమైన సాధనంగా ఉపయోగిస్తున్నాయి. అంటే నిర్దిష్ట వెబ్సైట్లు లేదా వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను పరిమితం చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అంశాలు బయటకు రాకుండా అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ ఆంక్షలు అమలు చేసింది. ఇంటర్నెట్ షట్‌డౌన్ సమయంలో కూడా వినియోగదారులు కమ్యూనికేట్ చేసుకునేలా వాట్సాప్ చర్యలు తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ వినియోగదారుల కోసం ప్రాక్సీ సపోర్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
* WhatsApp ప్రాక్సీ సపోర్ట్ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది?
ప్రాక్సీ సపోర్ట్ వినియోగదారులకు ప్రపంచవ్యాప్తంగా వాలంటీర్లు, సంస్థలు ఏర్పాటు చేసిన సర్వర్ల ద్వారా వాట్సాప్‌కి కనెక్ట్ అయ్యే అవకాశం కల్పిస్తుంది. ఇంటర్నెట్ సదుపాయం ఉంటే, ప్రాక్సీని క్రియేట్ చేసిన ట్రస్టెట్ సోర్సెస్ కోసం సోషల్ మీడియా లేదా సెర్చ్ ఇంజిన్ల ద్వారా సెర్చ్ చేయవచ్చు. వాట్సాప్ కోసం ప్రాక్సీ సర్వర్కి ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
Android ఫోన్లో ప్రాక్సీకి ఎలా కనెక్ట్ చేయాలి?
ముందుగా ఆండ్రాయిడ్ డివైజ్‌లో వాట్సాప్ ఓపెన్ చేయాలి చాట్స్ ట్యాబ్‌లో మోర్ ఆప్షన్స్‌లోకి వెళ్లి సెట్టింగ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత స్టోరేజ్ అండ్ డేటాపై క్లిక్ చేయాలి. అనంతరం ప్రాక్సీ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. తర్వాత సెట్ ప్రాక్సీ ఆప్షన్‌పై క్లిక్ చేసి ప్రాక్సీ అడ్రెస్ ఎంటర్ చేయాలి. చివరిగా సేవ్‌పై క్లిక్ చేయండి. కనెక్షన్ విజయవంతమైతే చెక్ మార్క్ కనిపిస్తుంది. ఇప్పటికీ ప్రాక్సీని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్‌లు సెండ్ చేయలేకపోయినా, రిసీవ్ చేసుకోలేకపోయినా.. ఆ ప్రాక్సీని బ్లాక్ చేశారని గుర్తించాలి. బ్లాక్ అయిన ప్రాక్సీ అడ్రెస్‌ని తొలగించడానికి.. దానిపై ట్యాప్‌చేసి ఉంచితే డిలీట్ ఆప్షన్ వస్తుంది. తర్వాత కొత్త ప్రాక్సీ అడ్రెస్ ఎంటర్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
iPhoneలో ప్రాక్సీకి ఎలా కనెక్ట్ చేయాలి?
వాట్సాప్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్‌పై క్లిక్ చేసి ప్రాక్సీ సెలక్ట్ చేయండి. అక్కడ ప్రాక్సీ అడ్రెస్ ఎంటర్ చేసి సేవ్ చేయండి. కనెక్షన్ విజయవంతమైతే చెక్ మార్క్ కనిపిస్తుంది. ప్రాక్సీని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్‌లు సెండ్ చేయలేకపోతే.. ఆ ప్రాక్సీ బ్లాక్ చేసినట్లు భావించి డిలీట్ చేయండి. కొత్త ప్రాక్సీ అడ్రెస్ ఎంటర్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రైవసీ ప్రొటెక్షన్
WhatsApp బ్లాగ్ ప్రకారం.. ప్రాక్సీ ద్వారా కనెక్ట్ అయి జరిపే కన్వర్జేషన్లకు కూడా వాట్సాప్ ప్రైవసీ ఉంటుంది. వ్యక్తిగత మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. థర్డ్ పార్టీ ప్రాక్సీని ఉపయోగించడం వల్ల IP అడ్రస్ని ప్రాక్సీ ప్రొవైడర్‌తో షేర్ చేయవచ్చని గమనించాలి. థర్డ్-పార్టీ ప్రాక్సీలను వాట్సాప్ అందించదు. (ప్రతీకాత్మక చిత్రం)