టెక్ కంపెనీలు డెవలప్ చేసే యాప్స్, ఎప్పటికప్పుడు కొత్తగా అప్డేట్ అవుతుంటాయి. మారుతున్న టెక్నాలజీతో పాటు సరికొత్త ఫీచర్లను పరిచయం చేయడం, బగ్స్ క్లియర్ చేయడం, కొత్త సేవలు అందించడం కోసం యాప్స్‌ను కొత్త వెర్షన్లకు అప్‌గ్రేడ్ చేస్తుంటాయి. ఈ క్రమంలో పాతతరం సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే డివైజెస్‌లో కొత్త వెర్షన్ యాప్స్ పనిచేయవు.
ఇప్పుడు iOS 12, ఆ తర్వాతి వెర్షన్ యాపిల్ డివైజ్‌లలో మాత్రమే వాట్సాప్ పనిచేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్ ఆపరేట్ చేయాలనుకుంటే, వారి డివైజ్ తప్పనిసరిగా ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.3 లేదా ఆ తర్వాతి వెర్షన్‌తో రన్ అవ్వాలి. వీటికి ముందు తరం ఓఎస్‌తో రన్ అయ్యే డివైజ్‌లు ఇకపై వాట్సాప్‌కు సపోర్ట్ చేయవు.
* ఎందుకిలా..? : వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్, ఫీచర్లను విడుదల చేస్తున్న నేపథ్యంలో, కాలం చెల్లిన సాఫ్ట్‌వేర్‌తో నడిచే స్మార్ట్ఫోన్లకు సపోర్ట్‌ను ఉపసంహరించుకుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ కలిపి.. పాత తరం ఓఎస్‌తో పనిచేస్తున్న మొత్తం 36 స్మార్ట్ఫోన్లలో నేటి నుంచి వాట్సాప్ పనిచేయదు. ఈ డివైజ్‌ల యూజర్లు వాట్సాప్ వాడటాకిని కొత్త ఓఎస్ వెర్షన్లతో రన్ అయ్యే ఫోన్లకు మారాల్సి ఉంటుంది. వాట్సాప్‌కు సపోర్ట్ ఆపేసే ఫోన్లు ఏవో ఓ లుక్కేద్దాం.