* ఐఫోన్ యూజర్లకు మాత్రమే
వాట్సాప్ వీడియో కాల్స్‌కు ఇండియాలో మంచి ఆదరణ ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వీడియో కాల్ యూజర్లలో భారత్‌లోనే ఎక్కువ మంది ఉన్నారు. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా యూజర్లు అన్ని రకాల డివైజెస్‌లో సులభంగా, తక్కువ డేటా వినియోగంతో వీడియో కాల్‌లను ఆస్వాదించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న వాట్సాప్ పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌తో వీడియో కాలింగ్‌కు మరింత ఆదరణ పెరగనుంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను బీటా వెర్షన్లో లాంచ్ చేశారు. సెలక్టెడ్ యూజర్లు ఈ ఫీచర్‌ను ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
వాట్సాప్ మరో సరికొత్త ఆప్షన్ సైతం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మెసేజ్ డిసప్పియరింగ్ షార్ట్‌కట్ ఆప్షన్‌ను సిద్దం చేస్తోంది. ఇది కూడా ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులో ఉంది. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.22.24.9 అప్డేట్లో మెసేజ్ డిజప్పియర్ చేసే షార్ట్‌కట్ ఫీచర్‌ను రీడిజైన్ చేస్తోంది. ఈ ఫీచర్‌తో కొత్త, పాత చాట్స్‌ను డిసప్పియర్ థ్రెడ్‌గా గుర్తించడం ఈజీ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఫ్లోటింగ్ విండోలో వాట్సాప్ వీడియో కాల్స్
ఐఓఎస్ యూజర్లకు వాట్సాప్ పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్ కొత్తదేమీ కాదు. మెసెంజర్, యూట్యూబ్ వంటి యాప్స్ ఇప్పటికే ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తన్నాయి. ఫ్లోటింగ్ విండోల ద్వారా మెసెంజర్ కాల్స్ చేస్తూనే.. యూట్యూబ్ వీడియోలు చూడవచ్చు. మరోవైపు, వాట్సాప్ ఇటీవలే మెసేజ్ యువర్ సెల్ఫ్ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది యూజర్ల నోట్స్ డౌన్లో ఉంచుకోవడానికి లేదా చాట్ల రూపంలో రిమైండర్లను గుర్తు చేయడానికి చాట్ విండోను అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)