1. మెటాకు చెందిన వాట్సప్ నుంచి ఇటీవల అతిపెద్ద అప్డేట్ వచ్చింది. యూజర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్న వాట్సప్ కమ్యూనిటీస్ (WhatsApp Communities) ఫీచర్ రోల్ ఔట్ ప్రారంభించింది మెటా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు ఈ ఫీచర్ లభిస్తోంది. కొన్ని నెలల్లో యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన యూజర్స్ వాట్సప్ కమ్యూనిటీస్ క్రియేట్ చేయొచ్చు. వేర్వేరు వాట్సప్ గ్రూప్స్‌ని కలిపి ఒక కమ్యూనిటీని తయారు చేయడం ఈ ఫీచర్ ప్రత్యేకత. వాట్సప్ కమ్యూనిటీలో ఏకంగా 50 వాట్సప్ గ్రూప్స్‌ని చేర్చొచ్చు. కాలనీవాసులు, పాఠశాలల్లో పేరెంట్స్ గ్రూప్స్, ఉద్యోగులకు ఉండే వేర్వేరు గ్రూప్స్‌ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు కమ్యూనిటీస్ ఫీచర్ ఉపయోగపడుతుందని మెటా తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఉదాహరణకు ఓ సంస్థలో ఉద్యోగులకు ఒక వాట్సప్ గ్రూప్, అధికారులకు మరో వాట్సప్ గ్రూప్, అడ్మిన్ స్టాఫ్‌కు ఇంకో వాట్సప్ గ్రూప్... ఇలా వేర్వేరు డిపార్ట్‌మెంట్స్‌కు వేర్వేరు గ్రూప్స్ ఉన్నాయనుకుందాం. అయితే ఆ సంస్థకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన సమాచారం అందరికీ షేర్ చేయాలనుకుంటే, ఆ మెసేజ్‌ను అన్ని గ్రూప్స్‌లోకి వేర్వేరుగా పంపాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేయండి. న్యూ ఛాట్ పైన క్లిక్ చేసి న్యూ కమ్యూనిటీ పైన క్లిక్ చేయండి. Get Started పైన క్లిక్ చేయండి. కమ్యూనిటీ పేరు, డిస్క్రిప్షన్, ప్రొఫైల్ ఫోటో ఎంటర్ చేయండి. కమ్యూనిటీ పేరు 24 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. ప్రస్తుతం ఉన్న గ్రూప్స్‌ని యాడ్ చేయండి. లేదా కొత్త గ్రూప్ క్రియేట్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. గ్రూప్స్ యాడ్ చేయడం పూర్తైన తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేస్తే కమ్యూనిటీస్ క్రియేట్ అవుతుంది. ఇలా వాట్సప్ కమ్యూనిటీ ఫీచర్ ద్వారా ఒక కమ్యూనిటీలో 50 వాట్సప్ గ్రూప్స్‌ని యాడ్ చేయొచ్చు. కాలనీలో, సంస్థలో, పాఠశాలల్లో వేర్వేరు గ్రూప్స్‌ని కమ్యూనిటీస్ ఫీచర్ ద్వారా ఒకే సెక్షన్లోకి తీసుకురావొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. అడ్మిన్స్ మాత్రమే కమ్యూనిటీస్ క్రియేట్ చేయొచ్చు. మేనేజ్ చేయొచ్చు. వాట్సప్ కమ్యూనిటీస్‌తో పాటు మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. వాట్సప్ యూజర్లు ఛాట్‌లో పోల్స్ క్రియేట్ చేయొచ్చు. 32 మంది ఒకేసారి వీడియో కాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక వాట్సప్ గ్రూప్‌లో ఏకంగా 1024 మంది సభ్యుల్ని చేర్చొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)