1. ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సప్ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు రిలీజ్ చేసింది. వాట్సప్ యూజర్ల ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ ప్రజెన్స్ (Online Presence) పేరుతో కొత్త ఫీచర్ రూపొందించింది. తమ ఆన్లైన్ స్టేటస్ అందరికీ కనిపించాలా వద్దా అన్నది వాట్సప్ యూజర్ల ఇష్టం. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే సెట్టింగ్స్ మారుస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. వాట్సప్‌లో ఆన్లైన్ స్టేటస్ కోసం ఇప్పుడు మరో సెట్టింగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ సెట్టింగ్‌తో ఆన్లైన్ ప్రజెన్స్ కొందరికి మాత్రమే కనిపిస్తుంది. అంటే మీరు ఆన్లైన్లో ఉన్నారన్న విషయం అందరికీ తెలియదు. మీరు ఎవరికి మీ ఆన్లైన్ ప్రజెన్స్ గురించి తెలియజేయాలనుకుంటే వారికే తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రస్తుతం ఉన్న ఫీచర్ చూస్తే డిఫాల్ట్‌గా ఆన్లైన్ స్టేటస్, లాస్ట్ సీన్ అందరికీ కనిపిస్తుంది. సెట్టింగ్స్ మార్చి లాస్ట్ సీన్ కనిపించకుండా చేయొచ్చు. అవతలివారికి లాస్ట్ సీన్ కనిపించకపోయినా, యూజర్ ఆన్‌లైన్‌లోకి రాగానే ఆన్లైన్ స్టేటస్ కనిపిస్తుంది. వాట్సప్ ఓపెన్ చేయగానే సదరు యూజర్ ఆన్లైన్లో ఉన్నట్టు కాంటాక్ట్స్ అందరికీ తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. అయితే తాము ఆన్లైన్లో ఉన్న విషయం అందరికీ తెలియకూడదని యూజర్లు అనుకుంటారు. ఇన్నాళ్లూ ఈ ఫీచర్ అందుబాటులో లేదు. తాజాగా వాట్సప్ ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఆన్లైన్ ప్రజెన్స్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఉపయోగించుకొని మీరు ఆన్లైన్లో ఉన్న విషయం కొందరు కాంటాక్ట్స్‌కి మాత్రమే తెలిసేలా చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. అంటే మీరు వాట్సప్ ఓపెన్ చేయగానే Online స్టేటస్ అందరికీ కనిపించదు. ఈ ఫీచర్ మీరు ఎనేబుల్ చేస్తే మీరు కోరుకున్న కాంటాక్ట్స్‌కి మాత్రమే మీరు ఆన్లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది. వారితో ఛాటింగ్ చేసేప్పుడు ఇతర యూజర్లకు మీరు ఆన్లైన్లో ఉన్న విషయం తెలియదు. మరి ఈ సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ముందుగా మీ వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి. టాప్ రైట్లో త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. Account పైన క్లిక్ చేయండి. ఆ తర్వాతి ఆప్షన్స్‌లో Privacy పైన క్లిక్ చేయండి. Last seen and online ఆప్షన్ పైన క్లిక్ చేయండి. లాస్ట్ సీన్ హైడ్ చేసేందుకు Everyone, My Contacts, My Contacts Except, Nobody అనే ఆప్షన్స్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. మీరు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి లాస్ట్ సీన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్స్ కింద ఆన్లైన్ స్టేటస్ ఎవరికి కనిపించేలా చేయాలో ఆప్షన్స్ ఉంటాయి. Everyone ఆప్షన్ ఎంచుకుంటే మీ ఆన్లైన్ స్టేటస్ అందరికీ కనిపిస్తుంది. Same as last seen సెలెక్ట్ చేస్తే మీరు లాస్ట్ సీన్ కోసం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేశారో వారికి మాత్రమే మీ ఆన్లైన్ స్టేటస్ కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)