ఫేక్ న్యూస్... భారతదేశానికి ఓ పెద్ద సమస్యగా, సవాలుగా మారింది. దీన్ని అడ్డుకోవడానికి సోషల్ నెట్వర్కింగ్ సంస్థలన్నీ చర్యలు మొదలుపెట్టాయి. ఫేక్ న్యూస్ ఎక్కువగా వాట్సప్‌లోనే సర్క్యులేట్ అవుతోంది. దీంతో ఫేక్ న్యూస్ అడ్డుకోవడానికి వాట్సప్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తోంది. సరికొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. టిప్‌లైన్ ఫీచర్ కూడా అలాంటిదే. (ప్రతీకాత్మక చిత్రం)
గతంలోనే ఫేక్ న్యూస్‌కు చెక్ చెప్పేందుకు 'Search image' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్. మీకు వచ్చిన ఫోటోను క్లిక్ చేసి 'Search image' పైన క్లిక్ చేస్తే నేరుగా గూగుల్‌లో అలాంటి ఇమేజెస్ ఏవైనా ఉంటే చూపిస్తుంది. దాన్ని బట్టి ఆ ఫోటో ఎక్కడిది? ఎప్పుడు తీశారు? మీకు వచ్చిన ఫోటోలో ఉన్న సమాచారం నిజమేనా? అని తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)