1. వాట్సప్ ఇటీవల కాలంలో కొత్త కొత్త ఫీచర్స్ రిలీజ్ చేస్తోంది. తాజాగా మరో ఫీచర్ రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. వాట్సప్ యూజర్లు తమ ఆన్లైన్ స్టేటస్ హైడ్ చేయొచ్చు. ఇప్పటికే లాస్ట్ సీన్ స్టేటస్ కొందరు కాంటాక్ట్స్‌కి హైడ్ చేసే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్‌కు కొనసాగింపుగా ఆన్లైన్ స్టేటస్ కూడా కనిపించకుండా చేసేలా కొత్త ఫీచర్ రాబోతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. వాట్సప్ యూజర్లు తమ లాస్ట్ సీన్ ఎవరికీ కనిపించకుండా సెట్టింగ్స్ చేయొచ్చు. లాస్ట్ సీన్ విషయంలో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. ఎవ్రీవన్ సెలెక్ట్ చేస్తే లాస్ట్ సీన్ అందరికీ కనిపిస్తుంది. మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేస్తే కాంటాక్ట్స్‌లో ఉన్న అందరికీ లాస్ట్ సీన్ కనిపిస్తుంది. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఆప్షన్ ద్వారా ఎవరి కాంటాక్ట్స్ అయినా సెలెక్ట్ చేస్తే వారికి తప్ప మిగతా వారికి లాస్ట్ సీన్ కనిపిస్తుంది. ఇక నోబడీ సెలెక్ట్ చేస్తే ఎవరికీ లాస్ట్ సీన్ కనిపించదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. వాట్సప్ ప్రైవసీ సెట్టింగ్స్ ఈ ఆప్షన్స్ ఉంటాయి. లాస్ట్ సీన్ మాత్రమే కాదు ప్రొఫైల్ ఫోటో, ఎబౌట్, స్టేటస్ విషయంలో కూడా ఇలాగే ఆప్షన్స్ సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు లాస్ట్ సీన్ ఫీచర్‌కు కొనసాగింపుగా ఆన్లైన్ స్టేటస్ విషయంలో కొత్త సెట్టింగ్స్ రాబోతున్నాయి. వాట్సప్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచానికి తెలిపే WABetaInfo ఈ ఫీచర్ గురించి తెలియజేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కొత్త ఫీచర్ వస్తే యూజర్లు తమ ఆన్లైన్ స్టేటస్‌ని కూడా అందరికీ హైడ్ చేయొచ్చు. ప్రస్తుతం లాస్ట్ సీన్ హైడ్ చేస్తే కాంటాక్ట్స్‌లో ఉన్నవారికి లాస్ట్ సీన్ కనిపించదు. ఇతరుల లాస్ట్ సీన్ చూడటానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఆన్లైన్లో ఉంటే ఆ విషయం తెలుస్తుంది. కొత్త ఫీచర్‌తో ఆన్లైన్ స్టేటస్ కూడా హైడ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. వాట్సప్ యూజర్లకు నెక్స్ట్ అప్డేట్లో ఈ ఫీచర్ రాబోతోంది. వాట్సప్ యూజర్లకు మరింత ప్రైవసీ అందించడంలో భాగంగా ఈ ఫీచర్ రూపొందిస్తోంది వాట్సప్. ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. బీటా టెస్టర్లు ఈ ఫీచర్ టెస్ట్ చేసిన తర్వాత యూజర్లందరికీ ఈ ఫీచర్ వస్తుంది. కాబట్టి వాట్సప్ యూజర్లు తమ ఆన్లైన్ స్టేటస్ హైడ్ చేసే ఫీచర్ కోసం ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక వాట్సప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ కూడా టెస్ట్ చేస్తోంది. వాట్సప్‌లో ఎవరికైనా పంపిన మెసేజ్ డిలిట్ చేసే గడువును పెంచబోతోంది. ప్రస్తుతం ఈ లిమిట్ గంట వరకు మాత్రమే ఉంది. కొత్త ఫీచర్ వస్తే 12 గంటలు లేదా రెండు రోజుల వరకు కూడా పాత మెసేజ్ డిలిట్ చేయొచ్చు. దీంతో పాటు వాట్సప్ మెసేజెస్ ఎడిట్ చేసే అవకాశం కూడా కల్పించబోతోంది. ఈ ఫీచర్స్ ఎప్పుడు వస్తాయన్న స్పష్టత లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక వాట్సప్ లేటెస్ట్గా డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్లో మరో మార్పు తీసుకొచ్చింది. గతంలో గ్రూప్స్‌కి మాత్రమే డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ వాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు పర్సనల్ ఛాట్స్‌కి కూడా ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. గ్రూప్స్‌లోనే కాదు వ్యక్తిగత ఛాట్స్‌లో కూడా 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల లిమిట్ సెట్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)