1. మెటా సంస్థకు చెందిన వాట్సప్ చాలాకాలం క్రితమే డిసప్పియరింగ్ మెసేజెస్ (Disappearing Messages) పేరుతో ఓ కొత్త ఫీచర్ పరిచయం చేసింది. వాట్సప్ మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ చేసేందుకు ఉపయోగపడే ఫీచర్ ఇది. దీని వల్ల ప్రత్యేకంగా మెసేజెస్ డిలిట్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే గడువు ప్రకారం మెసేజెస్ డిలిట్ అయిపోతుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. వాట్సప్ ఛాట్స్‌కి, గ్రూప్స్‌కి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ పనిచేస్తుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసి 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల్లో ఏదైనా ఒక గడువు ఎంచుకుంటే చాలు. సరిగ్గా ఆ గడువు ప్రకారం మెసేజెస్ డిలిట్ అవుతాయి. ఉదాహరణకు 7 రోజులు సెలెక్ట్ చేస్తే మెసేజెస్ ఏడు రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఒక వైపు నుంచే పనిచేస్తుంది. ఉదారణకు మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారు ఎవరైనా డిసప్పియరింగ్ మెసేజెస్ ఎనేబుల్ చేస్తే వారు పంపే మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి. వారి ఛాట్స్‌లో లేదా మీ ఛాట్స్‌లో ఆ మెసేజెస్ ఏవీ కనిపించవు. కాబట్టి మీరు ఆ మెసేజెస్ సేవ్ చేద్దామనుకున్నా సేవ్ చేసే అవకాశం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇప్పుడు ఈ సమస్యకు వాట్సప్ ఓ పరిష్కారం కనిపెట్టింది. కావాలనుకుంటే మీరు కొన్ని మెసేజెస్‌కి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ పనిచేయకుండా చేయొచ్చు. అంటే ఏదైనా ఛాట్‌కి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఎనేబుల్ చేసి ఉన్నా, మీకు కావాలనుకున్న మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ కాకుండా ఆపొచ్చు. వాటిని ఎప్పుడూ ఛాట్‌లో కనిపించేలా చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. WABetaInfo సమాచారం ప్రకారం డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఆన్‌లో ఉన్న ఛాట్స్లోని మెసేజెస్‌ని యూజర్స్ సేవ్ చేసుకునేలా వాట్సప్ మార్పులు చేస్తోంది. దీని వల్ల ముఖ్యమైన సమాచారం, మెసేజెస్, అడ్రస్‌లు, ఫోన్ నెంబర్ల లాంటివన్నీ డిలిట్ కాకుండా జాగ్రత్తపడొచ్చు. ఇది యూజర్లకు పెద్ద ఊరటే. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇప్పటికే వాట్సప్ బీటా యూజర్లు ఈ ఫీచర్‌ని టెస్ట్ చేస్తున్నారు. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో 'Kept Messages' పేరుతో కొత్తగా ఓ సెక్షన్ కనిపిస్తోంది. ఆ సెక్షన్లో యూజర్ సేవ్ చేసిన మెసేజెస్ కనిపిస్తాయి. అయితే ఆండ్రాయిడ్ యూజర్లకు, ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నది తెలియదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఒకవేళ ఇప్పటివరకు ఈ ఫీచర్ ఉపయోగించనివారు ఉంటే తమ కాంటాక్ట్స్‌కి, గ్రూప్స్‌కి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ వాడుకోవచ్చు. ఏ ఛాట్‌కు డిసప్పియరింగ్ మెసేజెస్ ఎనేబుల్ చేయాలనుకుంటే ఆ ఛాట్ ఓపెన్ చేయాలి. కాంటాక్ట్ పైన క్లిక్ చేయాలి. అందులో Disappearing Messages డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది. ఆన్ చేస్తే 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఏదైనా ఓ ఆప్షన్ ఎంచుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)