ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన యూజర్లకు బెస్ట్ కమ్యూనికేషన్ ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తమ బంధుమిత్రులతో కమ్యూనికేట్ అయ్యేందుకు వాట్సాప్‌ను బాగా యూజ్ చేస్తున్నారు. బంధుమిత్రులతో జరిపిన చాట్స్‌ను భద్రంగా బ్యాకప్ చేసుకునేందుకు వీలుగా చాట్ బ్యాకప్ (Chat Backup) ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఫీచర్‌తో ముఖ్యమైన చాట్స్‌ను గూగుల్ డ్రైవ్ (Google Drive)లో సేవ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ చాట్స్, ఫొటోల కోసం ఆటోమేటిక్ బ్యాకప్ ఆప్షన్‌ను సెట్ చేయవచ్చు. డైలీ, వీక్లీ లేదా మంత్లీ బ్యాకప్స్ చేసుకోవచ్చు. ఇలా బ్యాకప్ చేసిన చాట్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఆన్ చేసి ఎవరూ యాక్సెస్ చేయకుండా జాగ్రత్త పడొచ్చు. మరి గూగుల్ డ్రైవ్‌కి వాట్సాప్ చాట్స్‌ను ఎలా బ్యాకప్ చేయాలి? బ్యాకప్ చాట్స్‌ను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
స్టెప్ 5: మీరు గూగుల్ అకౌంట్‌ను సెటప్ చేయనట్లయితే, ప్రాంప్ట్ నోటిఫికేషన్లో "యాడ్ అకౌంట్" క్లిక్ చేసి మీ లాగిన్ సమాచారాన్ని సబ్మిట్ చేయాలి.
స్టెప్ 6: "బ్యాకప్ ఓవర్" ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్యాకప్ల కోసం వైఫై లేదా మొబైల్‌లలో కావాల్సిన నెట్‌వర్క్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ డేటా నెట్వర్క్ ద్వారా బ్యాకప్ చేస్తే చాలా ఇంటర్నెట్ డేటా ఖర్చు అవుతుంది. అందుకే వైఫై సెలెక్ట్ చేసుకోవడం బెటర్. (ప్రతీకాత్మక చిత్రం)
వాట్సాప్ బ్యాకప్ల కోసం సేఫ్టీ ఫీచర్‌ను ఎలా ప్రారంభించాలి?
మీరు మీ చాట్ హిస్టరీని థర్డ్-పార్టీ సర్వర్కి బ్యాకప్ చేస్తారు కాబట్టి అదనపు ప్రొటెక్షన్ కోసం వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రైవసీ అందిస్తుంది. గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ టర్న్ ఆన్ చేయడం చాలా సులభం. (ప్రతీకాత్మక చిత్రం)