1. మెటా (గతంలో ఫేస్బుక్) యాజమాన్యంలోని ఇన్స్టన్ట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ రోజు రోజుకు కొత్త ఫీచర్లు జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. వాట్సాప్ తాజాగా ‘కమ్యూనిటీ’ అనే మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ ఫీచర్‌పై పనిచేస్తోంది. గ్రూప్ చాట్లను క్రమబద్ధీకరించడానికి వాట్సాప్ ఈ 'కమ్యూనిటీ' ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మరో ప్రముఖ చాటింగ్ యాప్ డిస్కార్డ్ (Discord) ప్లాట్‌ఫాంలో ఉండే కమ్యూనిటీ ఫీచర్ మాదిరిగానే వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ పనిచేయనుంది. ఈ కొత్త ఫీచర్ ప్రకారం, వాట్సాప్ కమ్యూనిటీలోని మెంబర్స్ వేర్వేరు గ్రూప్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఆయా గ్రూప్‌లకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటెక్షన్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కమ్యూనిటీలకు అడ్మిన్‌గా ఉన్న వ్యక్తులు కమ్యూనిటీలోని అన్ని గ్రూప్లలోకి కూడా మెసేజ్‌లు పంపే వెసులుబాటు ఉంటుంది. సాధారణ వాట్సాప్ గ్రూప్‌ల లాగే కమ్యూనిటీ అడ్మిన్లు ఇతరులను ఇన్వైట్ లింక్, క్యూఆర్ కోడ్ ద్వారా మాన్యువల్‌గా గ్రూప్లలోకి తీసుకోవచ్చు. అయితే ఇలా చేరిన వ్యక్తికి కొన్ని ఫీచర్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్ ఇంకా ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా టెస్టర్లకు అందుబాటులోకి రాలేదు. ఈ ఫీచర్‌కు రోల్ అవుట్‌కి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్ తన గ్రూప్స్ ఫీచర్‌ను తొలగించనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)