తాజాగా వినియోగదారులకు మరో గుడ్‌న్యూస్ అందించింది. ఒకేసారి ఎక్కువ మీడియా ఫైల్స్‌ను షేర్ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్ బీటాలో చాట్లలో గరిష్టంగా 100 మీడియాలను షేర్ చేసేలా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అందించింది. ఈ లేటెస్ట్ అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* మీడియా పికర్ లిమిట్ పెంపు : WABetaInfo నివేదిక ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ వినియోగదారులు యాప్‌లోని మీడియా పికర్ ద్వారా గరిష్టంగా 100 మీడియాలను షేర్ చేసే అవకాశం కలుగుతుంది. ఇంతకుముందు మీడియా పికర్ ఫీచర్‌కు 30 మీడియాలను యాడ్ చేసే ఆప్షన్ మాత్రమే ఉండేది. త్వరలోనే వినియోగదారులు అందరికీ లేటెస్ట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. 100 మీడియాలను షేర్ చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ల కోసం గూగుల్ ప్లే(Google Play) బీటా ప్రోగ్రామ్ ద్వారా అందుబాటులో వచ్చింది. అప్డేట్ 2.23.4.3 వెర్షన్ డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులను చాట్‌లో ఒకేసారి 100 మీడియాను షేర్ చేసే ఆప్షన్ వస్తుంది. ఇది iOS బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంటుందా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదు.
* రిపీటెడ్ ఫైల్స్‌ను నివారిస్తుంది : వాట్సాప్ వినియోగదారులు ఇప్పుడు మొత్తం ఆల్బమ్‌ను కాంటాక్ట్స్‌తో పంచుకోగలుగుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మరిన్ని జ్ఞాపకాలు, క్షణాలను షేర్ చేసుకునే సదుపాయం కలుగుతుందని WABetaInfo పేర్కొంది. అంతేకాకుండా పెద్ద మీడియా ఫైల్‌లను ఒకేసారి పంపుతున్నప్పుడు వినియోగదారులు ఒకే ఫోటో లేదా వీడియోని రెండుసార్లు షేర్ చేయకుండా ఈ ఫీచర్ సహాయపడుతుంది.
* గ్రూప్ సబ్జెక్ట్స్, డిస్క్రిప్షన్ క్యారక్టెర్స్ లిమిట్ పెంపు : వాట్సాప్ మరో అప్డేట్ను అందించే ప్రయత్నాల్లో కూడా ఉంది. యూజర్లు వాట్సాప్‌లో గ్రూప్ సబ్జెక్ట్‌లు, డిస్క్రిప్షన్ల క్యారక్టెర్స్ లిమిట్‌ను పెంచే ప్రయత్నాల్లో ఉంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌కు ఈ అప్డేట్ అందించనుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా గ్రూప్ ఉద్దేశ్యం, నియమాలు, చర్చనీయాంశాలు తదితర వివరాలను గ్రూప్ సభ్యులకు వివరించే అవకాశం ఉంటుంది.