1. వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇటీవల ఒకే రోజు వాట్సప్ 5 ఫీచర్స్ (WhatsApp Features) రిలీజ్ చేసింది. ప్రైవేట్ ఆడియన్స్ సెలెక్టర్, వాయిస్ స్టేటస్, స్టేటస్ రియాక్షన్స్, స్టేటస్ ప్రొఫైల్, లింక్ ప్రివ్యూ ఫీచర్స్‌ని పరిచయం చేసింది. మెటా (Meta) ఆధ్వర్యంలోని వాట్సప్ ఈ ఫీచర్స్‌ని యూజర్లకు రోల్ అవుట్ చేస్తోంది. త్వరలోనే యూజర్లందరికీ ఈ 5 వాట్సప్ ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయి. మరి ఈ 5 ఫీచర్స్ ఎలా పనిచేస్తాయి? వాట్సప్ యూజర్లు ఈ ఫీచర్స్‌ని ఎలా వాడుకోవాలి? తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
2. Private Audience Selector: మీరు షేర్ చేసే స్టేటస్ ప్రతీది మీ కాంటాక్ట్‌లో ఉన్న యూజర్లు అందరికీ కాకపోవచ్చు. అందుకే ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసింది వాట్సప్. మీరు అప్డేట్ చేసే స్టేటస్ ఎవరు చూడాలో మీరే నిర్ణయించే అవకాశం ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసిన ఆడియన్స్ సెలెక్షన్ తర్వాత స్టేటస్‌కు డిఫాల్ట్‌గా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)