* తేదీ ప్రకారం సెర్చింగ్ : కొత్త ఫీచర్‌తో యూజర్లు తేదీ వారీగా నిర్దిష్ట మెసేజ్‌ల కోసం సెర్చ్ చేయవచ్చు. కన్వర్జేషన్లో నిర్దిష్ట టైమ్ పాయింట్‌కి కూడా వెళ్లవచ్చు. అంటే పాత చాట్లను కనుగొనడం చాలా సులభం అవుతుంది. అలా చాట్ హిస్టరీపై యూజర్లకు మరింత నియంత్రణను ఈ ఫీచర్ అందిస్తుంది. అలానే ఇతర యాప్‌ల నుంచి ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ మీ వాట్సాప్ చాట్లలోకి లాగి డ్రాప్ చేయవచ్చు. దీనివల్ల షేరింగ్ సమయంలో చాలా టైమ్ సేవ్ అవుతుంది. ఈ అప్డేట్ అనేది యూజర్లు తమ ఆన్లైన్ స్టేటస్ హైడ్ చేసుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. తద్వారా మీరు వాట్సాప్‌లో ఉన్నప్పుడు మీరు ఆన్లైన్ ఉన్నట్లు ఎవరికీ తెలియదు.
WABetaInfo స్క్రీన్‌షాట్ గమనిస్తే.. ఈ కొత్త ఫీచర్లను ఉపయోగించడానికి, మీరు కన్వర్జేషన్లో సెర్చ్ మోడ్‌ను ఆన్ చేస్తే సరిపోతుందని తెలుస్తోంది. ఇక డ్రాగ్ & డ్రాప్ ద్వారా ఫోటోలు ఎలా షేర్ చేయాలో అందరికీ ఏం తెలిసే ఉంటుంది. మీ వాట్సాప్ అకౌంట్‌కు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటే, మీరు వెంటనే దాన్ని ఉపయోగించుకోవచ్చు. మీకు ఇంకా కొత్త ఫీచర్ రాకపోతే.. అది త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని చెప్పొచ్చు.
* కొత్త ఫీచర్ : మరోవైపు వాట్సాప్ ఐఓఎస్ iOS 23.2.0.71 బీటా వెర్షన్ ద్వారా 3 బ్లాక్ షార్ట్‌కట్స్‌ను యూజర్లకు రిలీజ్ చేస్తోంది. అలానే యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ 23.1.75 అప్డేట్లో వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ప్రత్యేకించి, గ్రూప్ అడ్మిన్లు నిర్దిష్ట గ్రూప్ పార్టిసిపెంట్ విషయంలో త్వరగా, సులభంగా చర్యలు తీసుకోవడానికి ఈ అప్డేట్ కొత్త షార్ట్‌కట్‌లను తీసుకువస్తుంది.