1. వాట్సప్ యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ వచ్చేసింది. ప్రస్తుతం బీటా వర్షన్లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
2. గతంలో ఐఓఎస్ యూజర్లకు ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్ రిలీజ్ చేసిన వాట్సప్... ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
3. వాట్సప్ బీటా యూజర్లు ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్‌ను పరీక్షించిన తర్వాత యూజర్లందరికీ ఈ ఫీచర్ వస్తుంది.
4. ఒకవేళ మీరు వాట్సప్ బీటా యూజర్ అయితే ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ సెట్ చేసుకోవచ్చు.
5. మీ వాట్సప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ టాప్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయాలి. Settings ఓపెన్ చేసి Account క్లిక్ చేయాలి.
6. Privacy ఆప్షన్లో మీకు Fingerprint lock క్లిక్ చేసి ఫింగర్‌ప్రింట్ రిజిస్టర్ చేసుకోవాలి.
7. అందులో 1 minute, 10 minutes, 30 minutes అని టైమ్ ఔట్ ఆప్షన్ ఉంటుంది.
8. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసిన తర్వాత ఫింగర్‌ప్రింట్ ద్వారా వాట్సప్ అన్‌లాక్ చేయొచ్చు.
9. మొత్తం వాట్సప్‌కు మాత్రమే ఫింగర్‌ప్రింట్ పనిచేస్తుంది. ఒక ఛాట్‌కు మాత్రమే ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఉపయోగించలేరు.
10. ఇందులో 'Show content in notifications' ఆప్షన్ కూడా ఉంటుంది. లాక్ స్క్రీన్‌పైన మెసేజ్ కంటెంట్ కనిపించాలో, వద్దో ఆప్షన్ ఎంచుకోవచ్చు.
...