WABetaInfo ప్రకారం, ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.23.2.8 అప్డేట్ ద్వారా స్టేటస్ అప్డేట్స్లో వాయిస్ నోట్లను రికార్డ్ చేయడానికి, షేర్ చేయడానికి యాక్సెస్ ఇచ్చే ఫీచర్ రిలీజ్ అవుతోంది. ఇప్పుడు బీటా టెస్టర్లు 2.23.2.8 వాట్సాప్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. గరిష్ఠంగా 30 సెకన్ల ఆడియోను రికార్డ్ చేసుకోవచ్చు. వాట్సాప్ కొత్త వెర్షన్‌ను అప్డేట్ చేసిన వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. త్వరలోనే స్టాండర్డ్ వాట్సాప్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
* కొత్తగా అప్డేట్స్ : స్టేటస్ ఫీచర్‌ను 2017లో వాట్సాప్ తన యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్‌ను అప్పటినుంచి ఇంప్రూవ్ చేస్తూనే ఉంది కానీ వాయిస్ నోట్స్ పంపించే ఫెసిలిటీ మాత్రం ఇప్పటివరకు తీసుకురాలేదు. ఈ లోటును కూడా భర్తీ చేసేందుకు ఇప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్‌తో కొత్త సామర్థ్యాన్ని తీసుకొని రావడానికి సిద్ధమైంది.
స్టేటస్ అప్డేట్లుగా షేర్ చేసే వాయిస్ నోట్లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి కాబట్టి యూజర్లు ఆందోళన పడక్కర్లేదని WABetaInfo తెలిపింది. ఈ వాయిస్ నోట్స్ యూజర్లు యాప్ సెట్టింగ్‌లలో ఎంచుకున్న వారికి మాత్రమే వినబడతాయి. ఇవి 24 గంటల తర్వాత అదృశ్యమవుతాయి. అంతకంటే ముందే వాటిని తొలగించుకునే ఆప్షన్ కూడా యూజర్లకు ఉంటుంది.