2. ఇలా కాకుండా ఒక్కో చాట్‌కు ఒక్కో వాల్‌పేపర్ ఉపయోగించే అవకాశం కల్పిస్తోంది వాట్సప్. అంటే ప్రతీ ఛాట్‌కు వాల్‌పేపర్ మార్చొచ్చు. వేర్వేరు వాల్ పేపర్స్ ఉంటాయి కాబట్టి పొరపాటున ఇతరులకు మెసేజెస్ పంపే అవకాశం ఉండదు. అంతేకాదు... స్టాక్ వాల్‌పేపర్ గ్యాలరీని కూడా అప్డేట్ చేసింది వాట్సప్. (ప్రతీకాత్మక చిత్రం)
3. మరిన్ని వాల్పేపర్స్ని యాడ్ చేసింది. ప్రస్తుతం ఉన్న డూడుల్ వాల్పేపర్స్లో కొత్త కలర్స్‌ని కూడా యాడ్ చేస్తోంది వాట్సప్. వాల్పేపర్స్కు సంబంధించిన మార్పులతో పాటు స్టిక్కర్స్‌ని సెర్చ్ చేసేలా మార్పులు చేసింది. వాట్సప్‌లో స్టిక్కర్స్ ఫీచర్ యూజర్లను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
4. అయితే ఎమొజీలను సెర్చ్ చేసినట్టు స్టిక్కర్లను సెర్చ్ చేసే అవకాశం లేదు. మూడ్‌కి తగ్గట్టుగా స్టిక్కర్ కావాలంటే వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారాన్ని తీసుకొచ్చింది వాట్సప్. స్టిక్కర్లను కూడా సెర్చ్ చేసే ఫీచర్ రిలీజ్ చేసింది. మీరు వాట్సప్‌లో స్టిక్కర్స్ వాడుతున్నట్టైతే సెర్చ్ ఆప్షన్ వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. అంటే మూడ్‌కి తగ్గట్టు Happy, Sad, Smile, Love ఇలా స్టిక్కర్స్ సెర్చ్ చేయొచ్చు. ఎమొజీల ద్వారా కూడా స్టిక్కర్స్ సెర్చ్ చేయడం ఈ ఫీచర్ ప్రత్యేకత. ఇక స్టిక్కర్స్ గ్యాలరీలో మరిన్ని స్టిక్కర్స్ యాడ్ చేసింది వాట్సప్. వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు చెందిన 'Together at Home' యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్ యాడ్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)