WHATSAPP RELEASED UPDATED PRIVACY POLICY USERS HAVE TO ACCEPT IT BY MAY 15 ANYWAY SS
WhatsApp: వాట్సప్ యూజర్లకు అలర్ట్... కొత్త ప్రైవసీ పాలసీ వచ్చింది... మే 15 డెడ్‌లైన్
WhatsApp Updated Privacy Policy | కొద్ది రోజుల క్రితం వాట్సప్ ప్రైవసీ పాలసీ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో వాట్సప్ ప్రైవసీ పాలసీని వెనక్కి తీసుకుంది. కొత్త ప్రైవసీ పాలసీని రూపొందించింది. మే 15 లోగా కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించాలని డెడ్‌లైన్ విధించింది.
1. గత నెలలో వాట్సప్ ప్రైవసీ పాలసీని రూపొందించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8 లోగా ఆ ప్రైవసీ పాలసీని అంగీకరించాలని డెడ్‌లైన్ పెట్టింది వాట్సప్. కానీ ఈ ప్రైవసీ పాలసీ వివాదాస్పదమైంది. యూజర్ల నుంచి వాట్సప్ తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
2. యూజర్ల డేటాను సేకరించడం మాత్రమే కాకుండా, థర్డ్ పార్టీ సంస్థలతో షేర్ చేసుకుంటామని వాట్సప్ చెప్పడంతో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్సప్ ప్రైవసీ పాలసీ నచ్చనివాళ్లంతా టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్స్‌కి మారిపోయారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
3. వాట్సప్ నుంచి వెళ్లిపోతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో వాట్సప్ అప్రమత్తమైంది. ప్రైవసీ పాలసీని వెనక్కి తీసుకుంది. త్వరలో మార్పులతో కొత్త పాలసీని విడుదల చేస్తామని చెప్పింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
4. వాట్సప్ చెప్పినట్టుగానే కొత్త ప్రైవసీ పాలసీని రూపొందించింది. ప్రైవసీ పాలసీని రిలీజ్ చేసింది. మార్పులతో రిలీజ్ చేసిన ప్రైవసీ పాలసీని మే 15 లోగా అంగీకరించాలని తాజాగా డెడ్‌లైన్ విధించింది. (image: WhatsApp)
5/ 9
5. వాట్సప్ యాప్‌లో బ్యానర్లో ఈ కొత్త ప్రైవసీ పాలసీని చూడొచ్చు. "మీ పర్సనల్ కాన్వర్జేషన్స్ మేము వినం, చదవం. అవి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో ఉంటాయి. అందులో ఎలాంటి మార్పు లేదు" అని వాట్సప్ వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
6. వ్యాపారులతో ఛాట్ చేసేలా, ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకునేలా మార్పులు చేస్తున్నామని తెలిపింది. తమ పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు డేటా షేర్ చేస్తామని కూడా వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
7. అయితే డేటా సెక్యూరిటీ, కమ్యూనికేషన్‌కు సంబంధించిన ప్రైవసీ విషయంలో రాజీ పడట్లేదని తెలిపింది. వ్యక్తిగత మెసేజెస్ అన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో ఉంటాయని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
8. వాట్సప్ గతంలో రిలీజ్ చేసిన ప్రైవసీ పాలసీకి, ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రైవసీ పాలసీకి పెద్ద తేడా ఏమీ లేదు. ఛాట్స్‌ను చూడమని, వాయిస్ మెసేజెస్ వినం అని మాత్రమే చెప్పింది. డేటా షేరింగ్ విషయంలో పెద్దగా మార్పులు ఏమీ లేవు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
9. వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీని మే 15 లోగా యాక్సెప్ట్ చేయాల్సిందే. అంతలోపు ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేస్తేనే ఆ తర్వాత యాప్ ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)