WhatsApp: వాట్సప్‌లో మరో రెండు కొత్త ఫీచర్స్... ఇలా వాడుకోవచ్చు
WhatsApp: వాట్సప్‌లో మరో రెండు కొత్త ఫీచర్స్... ఇలా వాడుకోవచ్చు
WhatsApp New Features | వాట్సప్ యూజర్లకు అలర్ట్. మరో రెండు కొత్త ఫీచర్స్ వచ్చేశాయి. మరి ఈ ఫీచర్స్ ఎలా ఉపయోగపడతాయో, ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.
1/ 7
1. యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందించడంలో వాట్సప్ ఎప్పుడూ ముందే ఉంటుంది. అందుకే వాట్సప్ యాప్ తరచూ అప్డేట్ అవుతూనే ఉంటుంది. వారానికో కొత్త ఫీచర్ యాడ్ అవుతూ ఉంటుంది. కొన్ని ఫీచర్స్ ఆకట్టుకోకపోయినా చాలావరకు కొత్త ఫీచర్స్ యూజర్లకు ఉపయోగపడేవే ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. ఇప్పుడు వాట్సప్ మరో రెండు ఫీచర్స్‌ని యాడ్ చేసింది. వాయిస్ మెసేజెస్‌కు ఫాస్ట్ ప్లేబ్యాక్ యాడ్ చేసింది. అంతేకాదు... వాయిస్ నోట్‌కి వేవ్‌ఫామ్స్ అంటే తరంగాలు కనిపించేలా ఫీచర్‌ని రూపొందించింది. గతంలో స్ట్రెయిట్ లైన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు తరంగాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. వాట్సప్ బీటా టెస్టర్లకు 2.21.13.17 ఆండ్రాయిడ్ వర్షన్లో ఈ అప్డేట్స్ కనిపిస్తాయి. అయితే కొందరు యూజర్లకు డార్క్ మోడ్‌లో వాయిస్ వేవ్‌ఫామ్ కనిపించట్లేదట. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఉన్న ఈ ఫీచర్ త్వరలో ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. ఇక వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్ స్టిక్కర్ ప్యాక్స్‌కి సంబంధించినది. వాట్సప్ యాప్‌లో ఉన్న స్టిక్కర్ ప్యాక్స్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. వాట్సప్‌లో స్టిక్కర్ ఫీచర్ యూజర్లను బాగా అట్టుకున్న సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. వాట్సప్‌లో స్టిక్కర్స్ క్రియేటీవ్‌గా ఉంటాయి. మాటల్లో కాకుండా స్టిక్కర్స్ ద్వారా తాము చెప్పాలనుకున్నది చెబుతుంటారు. ఈ స్టిక్కర్స్ అవతలివారికి నచ్చితే వాటిని డౌన్లోడ్ చేసుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. ఇకపై స్టిక్కర్ ప్యాక్ మొత్తాన్ని స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఫార్వర్డ్ చేయొచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. వాట్సప్ యూజర్లు తమ స్టిక్కర్ స్టోర్‌లో ఏదైనా స్టిక్కర్ ప్యాక్ సెలెక్ట్ చేస్తే ఫార్వర్డ్ ఆఫ్షన్ కనిపిస్తుంది. ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఎవరికి పంపాలనుకుంటున్నారో వారి ఛాట్ సెలెక్ట్ చేయాలి. ఫార్వర్డ్ క్లిక్ చేస్తే అవతలివారికి స్టిక్కర్ ప్యాక్స్ వెళ్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)