5. ఒకవేళ 100 ఎంబీకి మించి ఫైల్ విజయవంతంగా సెండ్ అయితే ఆ సదుపాయం మీకు అందుబాటులోకి వచ్చినట్టే ఒకవేళ ఫెయిల్ అయితే త్వరలో మీకు అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా ఫోన్లలో హై రిజల్యూషన్ ఉన్న వీడియోలను, ఫొటోలను షేర్ చేసుకోడానికి యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ సదుపాయం ద్వారా ఎక్కువ నిడివి కలిగిన వీడియోలతో పాటు సినిమాలు కూడా నచ్చిన వారికి షేర్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. అంతే కాకుండా తాజాగా వెబ్ వెర్షన్‌కు మూడు కొత్త ఫీచర్లను జోడించింది. మీడియా ఎడిటింగ్ (media editing), లింక్ ప్రివ్యూ (link preview), స్టిక్కర్ సజెషన్ ఫీచర్లను సంస్థ తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు వాట్సాప్ యూజర్లు (WhatsApp Users) వెబ్ వెర్షన్లో సైతం ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. దీంతో పాటు లింక్‌లను ప్రివ్యూ చేయవచ్చని కంపెనీ ప్రకటించింది. అదనంగా కొత్త స్టిక్కర్ సజెషన్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చిన తరువాత యూజర్లు మెసేజ్ (message) టైప్ చేసేటప్పుడు స్టిక్కర్ సజెషన్స్ (sticker suggestions) కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)