వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలిసీపై దుమారం కొనసాగుతోంది. ఇతర వేదికలపై డేటా పంచుకునేందుకు అనుమతించేలా.. కొత్త ప్రైవసీ పాలసీ, సర్వీస్ రూల్స్‌ను కస్టమర్లు పాటించాల్సిందేనని యూజర్లను ఆదేశించడంతో.. వాట్సాప్‌పై అందరూ గుర్రుగా ఉన్నారు. దీనిపై ఇప్పటికే కోర్టులో విచారణ జరుగుతుండగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌ను గట్టిగా హెచ్చరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
నిబంధనలను అంగీకరించకపోతే వాట్సాప్ అకౌంట్‌ను తొలగిస్తామనే సందేశాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సందర్భంగా 2017 జస్టిస్ కేఎస్ పుట్టస్వామి కేసును ప్రస్తావించింది. ప్రజల వ్యక్తిగత గోప్యత, అంగీకార సూత్రాలకు విలువ ఇవ్వాలనే సుప్రీంకోర్టు తీర్పును వాట్సాప్ దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)