ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్లు పంపించిన మెసేజ్‌లను ఇతరులకు కూడా డిలీట్ చేసే వెసులుబాటును గతంలోనే కల్పించింది. అయితే ఇప్పుడు డిలీట్ చేసిన మెసేజ్ (Deleted Messages)లను తిరిగి పొందేలా మరొక ఫీచర్‌ను తీసుకు రాబోతోంది. ఈ ఫీచర్ రిలీజయ్యాక మెసేజ్ డిలీట్ చేసినా కొద్ది సెకన్ల పాటు "అన్డూ (Undo)" అనే ఆప్షన్ మెసేజ్ బార్ కింద కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా డిలీట్ చేసిన మెసేజ్‌ను తిరిగి పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం వాట్సాప్‌లో డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete For Everyone), డిలీట్ ఫర్ మీ (Delete For Me) అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఒక్కోసారి యూజర్లు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే బటన్‌పై క్లిక్ చేయడానికి బదులుగా డిలీట్ ఫర్ మీ అనే ఆప్షన్‌పై పొరపాటున క్లిక్ చేస్తారు. ఇలాంటి సందర్భంలో మళ్లీ ఈ మెసేజ్‌ను తిరిగి పొందటం, దాన్ని అందరికీ డిలీట్ చేయడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు యూజర్లకు చాలా చిరాకేస్తుంది. అందుకే ఈ సమస్యపై వాట్సాప్ దృష్టి సారిస్తోంది. ప్రస్తుతానికి అన్డూ ఫీచర్ ప్రయోగ దశలోనే ఉంది కాబట్టి రెగ్యులర్ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చేలోపు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
అనుకోకుండా లేదా పొరపాటున డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి తీసుకురావడానికి ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుందని వాట్సాప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ తెలిపింది. 'అన్డూ' బటన్ స్వల్ప వ్యవధి పాటు స్క్రీన్ కింద భాగంలో పాప్ అప్ అవుతుందని... ఈ బటన్‌పై నొక్కి యూజర్లు డిలీటెడ్ మెసేజ్‌ను తిరిగి పొందొచ్చని వాట్సాప్ బీటా ఇన్ఫో ఒక స్క్రీన్ షాట్ ద్వారా వివరించింది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం, వాట్సాప్ యూజర్లు మెసేజ్ తిరిగి పొందడానికి కొన్ని సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. ఆ సమయంలోగా 'అన్డూ' బటన్‌పై క్లిక్ చేయని పక్షంలో ఆ మెసేజ్ శాశ్వతంగా డిలీట్ అవుతుంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.22.13.5లో ఈ ఫీచర్ విడుదల కానుందని సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఫీచర్ వాట్సాప్ బీటాలో రావడం వల్ల పొరపాటున మెసేజ్‌ను మీకు మాత్రమే డిలీట్ చేసుకున్నా, ఆ మెసేజ్ అవతలి వ్యక్తి చాట్ నుంచి డిలీట్ చేయలేమని ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. అన్డూ బటన్‌తో సింపుల్‌గా ఆ మెసేజ్‌ను మళ్లీ పొంది వారికి డిలీట్ చేయవచ్చు. ఈ ఫీచర్ రెగ్యులర్ వెర్షన్లో కూడా త్వరలో అందుబాటులోకి వస్తే అందరికీ ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే ఈ ఫీచర్ కేవలం డిలీట్ ఫర్ మీ (Delete For Me) అని నొక్కినప్పుడే పని చేస్తుందా లేక డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete For Everyone) అని పొరపాటున ట్యాప్ చేసినప్పుడు కూడా మెసేజ్‌ని తిరిగి అందిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. యూజర్లు ఒక్కోసారి అనుకోకుండా డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అని కూడా ట్యాప్ చేస్తుంటారు. దీనివల్ల మళ్లీ మెసేజ్ అంతా టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. మరి వాట్సాప్ దీనిని దృష్టిలో పెట్టుకుని డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఉపయోగించి డిలీట్ చేసిన మెసేజ్‌లను కూడా తిరిగి అందిస్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)
పంపించిన మెసేజ్‌లను అన్డూ చేసే ఫీచర్ జీమెయిల్లో బాగా పాపులర్ అయ్యింది. సాధారణంగా జీమెయిల్లో 'సెండ్' బటన్ నొక్కినప్పుడు 'అన్డూ' ఆప్షన్ కనిపిస్తుంది. అచ్చం అలాగే వాట్సాప్‌లో కూడా త్వరలోనే 'అన్డూ' కనిపించనుంది. జీమెయిల్లోని అన్డూ అనేది ఇన్‌కంప్లీట్ లేదా మిస్టేక్స్ ఉన్న మెయిల్‌ను వెనక్కి తీసుకోవడానికి అదనపు సెకన్లు అందిస్తుంది. టెలిగ్రామ్ వంటి ఇతర మెసేజింగ్ యాప్‌ల్లో ఇలాంటి ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)