ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ప్రపంచంలోనే నంబర్ వన్ మెసేజింగ్ యాప్‌గా దూసుకెళ్తుంది. అయితే లేటెస్ట్ ఫీచర్స్‌తో ఎప్పటికప్పుడు ముందుండే వాట్సాప్‌లో ఇంకా అందుబాటులోకి రావాల్సిన ఫీచర్లు కొన్నిమిగిలి ఉన్నాయి. అందులో భాగంగానే గ్రూప్ పోల్స్‌ను ఇంట్రడ్యూస్ చేస్తోంది వాట్సాప్. (ప్రతీకాత్మక చిత్రం)
ఎక్కువ ఫీచర్లు కలిగి ఉన్న మెసేజింగ్ యాప్స్‌లో టెలిగ్రామ్ ముందుటుంది. అందుకే టెలిగ్రామ్‌లో ఎక్కువగా పాపులర్ అయిన ఫీచర్లను తమ యూజర్ల కోసం డెవలప్ చేసే పనిలో పడింది వాట్సాప్. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం యూజర్ల కోసం వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్లో గ్రూప్ చాట్లలో పోల్స్‌ను క్రియేట్ చేసేందుకు వీలుగా గ్రూప్ పోల్స్ ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలిపే స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది.
(ప్రతీకాత్మక చిత్రం)
వాట్సాప్ లో పంపే మెసేజ్‌లు, అటాచ్మెంట్స్ లాగానే పోల్స్ వివరాలు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా సేఫ్‌గా ఉండే అవకాశం ఉంది. అలాగే గ్రూప్ మెంబర్స్ మాత్రమే పోల్ రిజల్ట్స్ చూసే వీలుంటుంది. ఈ పోలింగ్ ఫీచర్.. ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత .. వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని వివాదాస్పద పోస్టులు, పోటాపోటీ పోస్టులు.. ఇలా అనేక వివాదాలకు దారితీసిన సందర్భాలున్నాయి. గ్రూపులో ఏం జరిగినా.. దానికి బాధ్యత అడ్మిన్‌దే అవుతుంది. అయితే ఈ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసేందుకు వాట్సాప్ రీసెంట్గా ఫీచర్ అప్డేట్ చేసింది. గ్రూప్‌లోని సదరు యూజర్ షేర్ చేసిన సందేశాలను తొలగించడానికి గ్రూప్ అడ్మిన్లను అనుమతించే ఫీచర్‌ను వాట్సాప్ డెవలప్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఫీచర్ సాయంతో.. గ్రూపులో అడ్మిన్లుగా ఉన్న వారు గ్రూప్‌లో ఏ సందేశాన్నైనా తొలగించవచ్చు. వాట్సాప్ గ్రూపు నిర్వహిస్తున్న వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రూపులో పనికి రాని మెసేజ్‌లు వస్తే వాటిని తొలగించాలంటూ పంపిన వారు మాత్రమే డిలీట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు డిలీట్ చేసే అనుమతి గ్రూప్ అడ్మిన్లకు కూడా ఉంటుంది. ఏదైనా మెసేజ్‌ను అత్యవసరంగా డిలీట్ చేయాల్సి వస్తే ఇప్పుడు గ్రూప్ అడ్మిన్ చేయవచ్చు. ఇంకా ఇలాంటి ఎన్నో అప్డేట్స్పై వాట్సాప్ పని చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)