ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫారం వాట్సాప్ (WhatsApp) ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయింది. కుటుంబ సభ్యుల నుంచి తెలిసిన వారి వరకు కమ్యూనికేట్ అయ్యేందుకు చాలా మంది వాట్సాప్‌పైనే ఆధారపడుతున్నారు. అయితే కోట్లాదిమంది ప్రజలు వాడే ఈ వాట్సాప్‌లో కొన్ని ముఖ్యమైన ప్రైవసీ ఫీచర్లు లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాటిలో ఒకటి అపరిచితుల కాల్స్ ఇబ్బంది పెట్టకుండా నిలిపివేసే ఫీచర్.
* స్కామ్ కాల్స్‌కు చెక్ : తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ నోటిఫికేషన్ సెంటర్లో, కాల్ లిస్ట్‌లో డిస్ప్లే అవుతున్నప్పుడు వాటిని సైలెంట్ చేయడానికి యూజర్లకు ఈ ఫీచర్ హెల్ప్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ కోసం అభివృద్ధి చేస్తున్నారని వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) వెల్లడించింది. స్పామ్ కాల్‌లను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కూడా ఈ ఫీచర్ హెల్ప్ అవుతుంది.
సాధారణంగా ఏదైనా గ్రూపులో చేరితే చాలు ఆ గ్రూపులోని తెలియని వారి నుంచి కూడా కాల్స్ వస్తుంటాయి. వీటి వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. అయితే కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే ఎవరు ఫోన్ కాల్ చేసినా యూజర్‌కి పెద్దగా ఎలాంటి ఇబ్బంది ఎదురు కాదు. ఎందుకంటే వారి ఫోన్ కాల్ చప్పుడు చేయకుండా సైలెంట్‌గా వచ్చి వెళ్లిపోతుంది.
ఈ అప్‌కమింగ్ ఫీచర్‌కు సంబంధించి WABetaInfo ఒక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. ఇందులో వాట్సాప్ యాప్ సెట్టింగ్స్‌లో 'సైలెన్స్ అన్నోన్ కాలర్స్' ఫీచర్ కనిపించింది. ఇది ఒక ఆప్షనల్ ఫీచర్‌గా అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్‌షాట్ ప్రకారం, తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ సైలెన్స్ చేసుకోవడానికి టోగుల్ ఆన్ చేయవచ్చు.
లేదంటే దానిని ఆఫ్ చేయవచ్చు. కాల్స్ సైలెన్స్ అయిన తర్వాత కూడా అవి కాల్, నోటిఫికేషన్ స్క్రీన్లలో కనిపిస్తాయి. తద్వారా ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది అనేది తెలుసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లకు స్పామ్ కాల్స్ వల్ల తలెత్తే తలనొప్పి తొలగిపోతుంది. అంతేకాదు స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ లిఫ్ట్ చేసే అవకాశం తగ్గుతుంది.
ఇక ఈ సంవత్సరం 'DigitALL: ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ' అనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్‌ను పురస్కరించుకుని, వాట్సాప్ దాని టాప్ ప్రైవసీ ఫీచర్లేవో తెలిపింది. వాటిలో బ్లాక్, ఎండ్-టు-ఎండ్ ఎన్స్క్రిప్షన్, గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్, ప్రొఫైల్ ఫొటో, లాస్ట్ సీన్, ఆన్లైన్ స్టేటస్, స్టేటస్ హైడ్ చేసే ఫెసిలిటీ వంటివి ఉన్నాయి. నేటి డిజిటల్ యుగంలో మహిళలకు ఈ ఫీచర్లు కట్టు దిట్టమైన ప్రైవసీ అందిస్తాయి.