* ఇతర యూజర్ల స్టేటస్ అప్డేట్(Status Update) రిపోర్ట్ చేయవచ్చు : వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్లు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం కొంత మంది బీటా టెస్టర్లకు మాత్రమే ఉంది. దశల వారీగా యూజర్లు అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం TestFlight యాప్ నుంచి iOS 23.4.0.74 అప్డేట్ ఇన్స్టాల్ చేసిన వాట్సాప్ బీటా టెస్టర్లకు ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.
వాట్సాప్ అప్డేట్స్ ట్రాక్ చేసే వెబ్సైట్ WABetaInfo నివేదిక మేరకు.. ‘స్టేటస్ అప్డేట్లను రిపోర్ట్ చేసే సదుపాయం డెవలప్మెంట్లో ఉందని తెలిపాం. వాట్సాప్ ఈ ఫీచర్ అందిస్తున్నందకు ధన్యవాదాలు. టర్మ్స్ ఆఫ్ సర్వీస్‌ని ఉల్లంఘించే స్టేటస్లపైన వినియోగదారులు మోడరేషన్ టీమ్‌కి రిపోర్ట్ చేయవచ్చు.
* నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : WABetaInfo షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. ఏ వాట్సాప్ అకౌంట్‌కు లేటెస్ట్ అప్డేట్ లభిస్తుందో.. అందులో స్టేటస్ ఆప్షన్స్‌లో ‘రిపోర్ట్’ అని కనిపిస్తుంది. స్టేటస్ అప్డేట్ను రిపోర్ట్ చేసినప్పుడు, మోడరేషన్ కారణాల వల్ల అది వాట్సాప్‌కు ఫార్వార్డ్ అవుతుంది. వాట్సాప్ ఆ స్టేటస్ కంటెంట్‌ను పరిశీలిస్తుంది. నియమాలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే, సంబంధిత అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది.
* నోటిఫికేషన్స్ మ్యూట్ ఆప్షన్ : కొంతమంది వినియోగదారులకు మెసేజ్ నోటిఫికేషన్స్‌లో మ్యూట్ ఆప్షన్ కనిపిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత పర్మనెంట్‌గా నోటిఫికేషన్స్ మ్యూట్ చేసే ఫీచర్ లభిస్తుంది. అంతే కాకుండా వాట్సాప్ ఇండియా జనవరిలో 2.9 మిలియన్ అకౌంట్లను నిషేధించినట్లు సమాచారం. తాజా నెలవారీ నివేదిక ప్రకారం.. 'యూజర్-సేఫ్టీ రిపోర్ట్'లో వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులు, అందుకు వాట్సాప్ కంపెనీ చూపిన పరిష్కారాలను పేర్కొంది.