ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫారం వాట్సాప్ (WhatsApp) వరుసగా కొత్త ఫీచర్స్ లాంచ్ చేస్తోంది. వినియోగదారులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు వేగంగా అప్డేట్స్ రిలీజ్ చేస్తోంది. తాజాగా ఆండ్రాయిడ్ యూజర్లు సులువుగా కాల్ చేసేందుకు కొత్త ఆప్షన్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ వాట్సాప్ ద్వారా కాల్స్ చేయడానికి ఉపయోగపడుతుంది.
WABetaInfo నివేదిక ప్రకారం.. అప్లికేషన్‌కి యాడ్ చేసే కాలింగ్ షార్ట్‌కట్ ఫీచర్ ద్వారా కాంటాక్ట్ లిస్ట్‌లోని కాంటాక్ట్ సెల్‌ను ప్రెస్ చేయడం ద్వారా కాల్ చేయవచ్చు. వినియోగదారులు సులువుగా కాల్ చేసే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా కొత్త రాబోయే ఫీచర్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత డివైజ్ హోమ్ స్క్రీన్కు ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుందని నివేదిక తెలిపింది.
WhatsApp ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 కింద ప్రచురించిన డిసెంబర్ ఇండియా మంత్లీ రిపోర్ట్‌లో.. 2022 డిసెంబర్ 1 నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య, 3,677,000 వాట్సాప్ అకౌంట్స్ నిషేధించింది. వీటిలో 1,389,000 అకౌంట్స్‌ను యూజర్ల నుంచి ఎలాంటి రిపోర్ట్స్ రాకముందే వాట్సాప్ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
గత సంవత్సరం అమల్లోకి వచ్చిన కఠినమైన IT నియమాలు, పెద్ద డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు (50 లక్షలకు పైగా వినియోగదారులతో) ప్రతి నెలా కాంప్లియన్స్ రిపోర్ట్స్ ప్రచురించాలని, అందిన ఫిర్యాదుల వివరాలను, తీసుకున్న చర్యలను పేర్కొనాలని ఆదేశించింది. పెద్ద సోషల్ మీడియా సంస్థల ప్లాట్‌ఫారమ్‌లు విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తికి కారణమవుతున్నాయని ఆరోపణలు వచ్చాయి.
దీంతో మార్చి 1 నుంచి సోషల్ మీడియా కంపెనీలపై యూజర్లు చేసిన ఫిర్యాదులను నిర్వహించే మూడు ఫిర్యాదుల అప్పీల్ కమిటీలను ప్రభుత్వం గత వారం ప్రకటించింది. డిసెంబర్లో వాట్సాప్ వినియోగదారుల అప్పీల్ 70 శాతం పెరిగి 1607కి పెరిగింది. ఇందులో 1,459 అకౌంట్స్‌ను నిషేధించాలనే అప్పీల్లు కూడా ఉన్నాయి. నవంబర్‌లో 946 అకౌంట్స్‌ను నిషేధించాలని ఫిర్యాదులు వచ్చాయి.