మెటా యాజమాన్యంలోని ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్ఫారం వాట్సాప్ (WhatsApp) అప్డేట్ల పరంపర కొనసాగుతోంది. వినియోగదారుల కోసం మరో లేటెస్ట్ ఫీచర్ (Latest Feature)ని వాట్సాప్ ప్రకటించింది. వెబ్ యూజర్లకు డు నాట్ డిస్టర్బ్ తరహా ఆప్షన్ అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ కాల్స్ నోటిఫికేషన్లను టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
* బీటా టెస్టర్లకు అందుబాటులో.. : వాట్సాప్ కాల్స్ నోటిఫికేషన్లను డిసేబుల్ చేసే ఆప్షన్‌ను వెబ్ యూజర్లు ప్రస్తుతం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. WaBetaInfo నివేదిక ప్రకారం.. ప్రస్తుతం వాట్సాప్ కాల్స్ ఆఫ్ చేసే ఫీచర్‌ను బీటా టెస్టర్లకు అందించారు. Windows 2.2250.4.0 అప్డేట్ ద్వారా వాట్సాప్ బీటా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఫీచర్ లభిస్తుంది.
* సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్ ఆప్షన్ : WhatsApp వెబ్ యూజర్లు వెబ్‌లోని సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్‌ను ఆన్ చేయవచ్చు. నోటిఫికేషన్స్ ఆప్షన్ దగ్గర కనిపించే బటన్‌ను ఆన్, ఆఫ్ చేయవచ్చు. ఇన్కమింగ్ వాట్సాప్ కాల్ల నోటిఫికేషన్లను డిసేబుల్ చేసే ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ లేటెస్ట్ ఫీచర్ ద్వారా కాల్ నోటిఫికేషన్స్‌ను కంట్రోల్ చేయవచ్చు.
* అవతార్ ఫీచర్ : ఈ నెల ప్రారంభంలో వాట్సాప్ తన ప్లాట్‌ఫారమ్‌లో అవతార్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అవతార్‌ను ఇష్టమైన విధంగా కస్టమైజ్ చేసి ప్రొఫైల్ పిక్చర్‌గా సెట్ చేసుకోవచ్చు. అదే విధంగా వివిధ ఎమోషన్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి వీలుగా.. తక్షణమే ప్రతిస్పందించేలా 36 ఎమోజీలను వాట్సాప్ అందించింది.
* వాట్సాప్‌లో అవతార్ ఎలా క్రియేట్ చేయాలి? : వాట్సాప్‌లో అవతార్‌ను క్రియేట్ చేయడానికి ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత అక్కడ కొత్తగా కనిపించే అవతార్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం క్రియేట్ యువర్ అవతార్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అవసరమైన కస్టమైజేసన్లు చేసిన తర్వాత కంప్లీట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు క్రియేట్ చేసిన అవతార్‌ను ప్రొఫైల్ పిక్చర్‌గా సెట్ చేసుకోవచ్చు.
* Undo బటన్ ఫీచర్ : వాట్సాప్ ఇటీవలే వినియోగదారులకు Undo బటన్ ఫీచర్‌ను అందజేసింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు మెసేజ్ డిలీట్ చేయడంలో పొరపాటు చేస్తే వెంటనే యాక్షన్ రివర్స్ చేయవచ్చు. ఏదైనా గ్రూప్‌లో లేదా యూజర్‌కు అనుకోకుండా పంపిన మెసేస్ను డిలీట్ చేసే సమయంలో డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్‌కి బదులుగా డిలీట్ ఫర్ మీ బటన్‌పై క్లిక్ చేసినప్పుడు.. ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.