వాట్సాప్ (WhatsApp) కొత్త ఫీచర్లతో తిరుగులేని మెసేజింగ్ యాప్‌గా అవతరిస్తోంది. మొదట్లో టెక్స్ట్ మెసేజ్‌లు పంపించడానికి మాత్రమే వీలు కుదిరిన ఈ యాప్‌లో ఇప్పుడు కాల్స్, వీడియో కాల్స్ చేయడం కూడా సాధ్యమవుతుంది. ఇంకా దీనిలో ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్లతో కమ్యూనికేట్ అయ్యే విధానం మరింత సులభం అయింది. వాట్సాప్ ఈ ఫీచర్లతోనే ఆగిపోలేదు.
* మరింత మెరుగ్గా మల్టీ డివైజ్ సపోర్టు : వాట్సాప్ మల్టీ-డివైజ్ సామర్థ్యాలను కూడా మెరుగుపరిచింది. దీనివల్ల ఇప్పుడు డివైజ్‌లను లింక్ చేయడం, ఆ డివైజ్‌ల అంతటా చాట్స్ సింక్ చేయడం చాలా సులభతరం అయ్యింది. అంతేకాదు ఈ ప్రాసెస్ కూడా వేగవంతం అయ్యింది. అలానే యాప్ ఇప్పుడు ఆండ్రాయిడ్ టాబ్లెట్లతో సహా మరిన్ని డివైజ్‌లకు మద్దతు ఇస్తుంది. మరోవైపు వాట్సాప్ Mac డెస్క్‌టాప్‌ల కోసం వేగవంతమైన యాప్‌ను పరీక్షిస్తోంది.
అలానే ఇకపై యూజర్ల ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉన్నా చాట్స్ సింక్ అయి, ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి. అయితే, స్మార్ట్‌ఫోన్‌ను 14 రోజులకు పైగా ఉపయోగించకుంటే.. లింక్డ్ డివైజ్ నుంచి ఆటోమేటిక్‌గా అకౌంట్ లాగ్ అవుట్ అవుతుంది. వాట్సాప్ లింక్ ప్రివ్యూలు, స్టిక్కర్లు వంటి కొత్త ఫీచర్లను కూడా జోడించింది. ఇక గ్రూప్‌లను మరింత ఈజీగా హ్యాండిల్ చేయడానికి, సులభంగా నావిగేట్ చేయడానికి గ్రూప్ అడ్మిన్ల కోసం వాట్సాప్ రెండు కొత్త ఫీచర్లను రీసెంట్గా ప్రవేశపెట్టింది.