1. మీడియా విజిబిలిటీ: ఏదో ఓ ఛాట్ నుంచి వచ్చే ఫైల్స్ హైడ్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు కాంటాక్ట్ ఇన్ఫోలోకి వెళ్లి 'Media Visibility' ఆప్షన్పై క్లిక్ చేయాలి. అందులో Default (Yes), Yes, No అని మూడు ఆప్షన్లుంటాయి. ఈ ఆప్షన్ యాక్సెప్ట్ చేస్తే అందులో వచ్చే ఫైల్స్ ఫోన్ గ్యాలరీలోకి సేవ్ కావు.
2. మ్యూట్ గ్రూప్ ఛాట్: వాట్సప్ గ్రూప్స్ మీ సర్కిల్లో ఉన్నవారిని ఒకేవేదికపైకి తీసుకొచ్చే మంచి ఫీచర్. కానీ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్, ఆఫీస్ ఇలా అనేక గ్రూప్స్ ఉంటాయి. వాటిలో వచ్చే మెసేజ్లతో మెసేజ్ టోన్ ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది. మీరు గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్లి 'Mute Chat' ఆప్షన్ ఎంచుకున్నారంటే ఇక మెసేజ్ టోన్స్ వినిపించవు.