దేశమంతా దీపావళి సంబరాల్లో మునిగిపోయింది. ఎక్కడ చూసిన పండగ సందడే కనిపిస్తోంది. ఉదయం నుంచి ఫోన్లన్నీ దీపావళి శుభాకాంక్షల మెసేజ్ లతో నిండిపోయాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఈ నేపథ్యంలో ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ దీపావళి సందర్భంగా వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్ ను ప్రారంభించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
ఈ ప్యాక్ ను డౌన్ లోడ్ చేసుకుని మీ ప్రియమైన వారికి ప్రత్యేక అనుభూతినిచ్చేలా పండుగ శుభకాంక్షలు తెలపొచ్చు. Android మరియు iOS-ఆధారిత గాడ్జెట్లలోనూ WhatsApp హ్యాపీ దీపావళి యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
హ్యాపీ దీపావళి 2021 గ్రీటింగ్ స్టిక్కర్లను డౌన్లోడ్ చేయడం కోసం ఈ కింది స్టెప్స్ ఫాలో కండి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
Step 1: ముందుగా మీ WhatsApp చాట్‌ని తెరవండి. టెక్స్ట్ బార్ పక్కనే ఉండే స్టిక్కర్ చిహ్నాన్ని నొక్కండి. ఇది GIF ఆప్షన్ పక్కనే ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
Step 2: అనంతరం మీకు కనిపించే 'ప్లస్' సింబల్ పై క్లిక్ చేయండి. మీకు WhatsApp స్టిక్కర్ లైబ్రరీ ఓపెన్ అవుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
Step 3: అక్కడ హ్యాపీ దీపావళి యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్ కనిపిస్తుంది. ఆ ప్యాక్ పక్కనే కనిపించే డౌన్ లోడ్ ఐకాన్ పై క్లిక్ చేయండి.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
Step 4: దీంతో మీకు దీపావళి స్టిక్కర్ ప్యాక్ డౌన్ లోడ్ అవుతుంది. ఇప్పుడు మీరు, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు వివిధ దీపావళి స్టిక్కర్ల పంపి ప్రత్యేకంగా పండుగ శుభాకాంక్షలు చెప్పొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)