ఒకప్పుడు ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్లను పెట్టెలు, బీరువాల్లో దాచుకునే వారు. కానీ ఈ డిజిటల్ యుగంలో సర్వం ఆన్లైన్ అయిపోయింది. డిజిలాకర్ వంటి డిజిటల్ డాక్యుమెంట్ వాలెట్లు వచ్చేశాయి. ఇది ఉంటే ఫిజికల్ డాక్యుమెంట్లను మోసుకెళ్లాల్సిన పనిలేదు. అన్నీ అక్కడే ఉంటాయి. ఐతే డిజిలాకర్ యూజర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. (ప్రతీకాత్మక చిత్రం)
వాట్సప్ ద్వారా డిజిలాకర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాట్సప్‌లో 9013151515 నెంబర్ ద్వారా ప్రజలు పాన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, 10, 12 తరగతుల మార్క్ షీట్లు, టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్లు పొందవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
డిజిలాకర్ సేవలను మరింత విస్తరిస్తూ... ప్రజలకు అవసరమైన దస్తావేజులను సులభంగా అందించడానికే.. ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాగా, డిజిలాకర్‌లో దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 కోట్లమందికి పైగా పేర్లు నమోదు చేసుకొని 5 కోట్లకు పైగా డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
డిజిలాకర్.. డిజిటల్ ఇండియా ప్రొగ్రామ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ వాలెట్ డాక్యుమెంట్ వాలెట్ ప్లాట్‌ఫామ్. దేశ పౌరులు తమ ముఖ్యమైన ధృవ పత్రాలను ఆన్లైన్లో స్టోర్ చేసుకునేందుకు దీనిని తీసుకొచ్చారు. ఇది ఉచితంగా లభిస్తుంది. డిజిలాకర్ ఉంటే ఫిజికల్ డాక్యుమెంట్లను ప్రతిసారి తీసుకెళ్లాల్సిన పనిలేదు.(ప్రతీకాత్మక చిత్రం)