ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ పాపులర్. అత్యధిక శాతం వినియోగదారులు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. చాటింగ్, ఎమోజీలు, సెక్యూరిటీ, కాలింగ్, పేమెంట్స్ వంటి ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్.. పెద్ద సైజ్ ఉన్న ఫైల్స్‌ను షేర్ చేసే విషయంలో నిరాశకు గురిచేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
గతంలో యూజర్లు ఒక్కసారి కేవలం 30 ఫోటోలను మాత్రమే సెండ్ చేసే అవకాశం ఉండేది. స్నేహితులు, కుటుంబం, సహోద్యోగులతో తరచుగా పెద్ద సంఖ్యలో ఫోటోలను పంచుకునే వ్యక్తులకు ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది. పంపిన ఫోటో, వీడియోను మళ్లీ పంపే సమస్య దూరమవుతుంది. షేరింగ్ మరింత సులువుగా, సమర్థంగా ఉంటుంది. బోలెడంత సమయం, శ్రమను తగ్గిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
* మీడియా షేరింగ్ లిమిట్ పెరిగిందా? లేదా?
లేటెస్ట్ అప్డేట్ను వాట్సాప్ దశలవారీగా విడుదల చేయనుంది. ఇంకా అప్డేట్ అందుకోని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే అప్డేట్ అందే అవకాశం ఉంది. కొత్త ఫీచర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి WhatsApp వెర్షన్ 2.22.24.73ని ఇన్స్టాల్ చేసి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
- స్క్రీన్ దిగువన ఉన్న పేపర్ క్లిప్ లాగా కనిపించే అటాచ్ ఐకాన్‌పై నొక్కండి.
- ఇప్పుడు కనిపించే ఆప్షన్స్‌లో ఫోటోలు అండ్ వీడియోస్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.
- తర్వాత స్మార్ట్‌ఫోన్ గ్యాలరీ నుంచి షేర్ చేయాలని అనుకుంటున్న ఫోటోలు, వీడియోలను సెలక్ట్ చేసుకోండి. ఒకేసారి గరిష్టంగా 100 ఐటెమ్స్ ఎంచుకోవచ్చు.
- మీడియా ఫైల్స్ సెలక్ట్ చేసిన తర్వాత చివరిగా సెండ్ బటన్‌పై క్లిక్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)