1. వాట్సప్ యాప్ ద్వారా ఛాటింగ్ ఇన్స్టంట్ మెసేజింగ్ సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. వాట్సప్ బిజినెస్ యాప్ (WhatsApp Business App) చిరు వ్యాపారులకు సేవల్ని అందిస్తోంది వాట్సప్. వాట్సప్ బిజినెస్ యాప్ యూజర్ల కోసం త్వరలో ప్రీమియం ప్లాన్ తీసుకురాబోతోంది. అంటే వాట్సప్ బిజినెస్ యాప్ యూజర్లు డబ్బులు చెల్లించి ఇతర సేవల్ని పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రస్తుతం వాట్సప్ బిజినెస్ యాప్‌ను ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. తమ వ్యాపారం కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్‌తో నేరుగా కస్టమర్లను కాంటాక్ట్ కావొచ్చు. తమ ప్రొడక్ట్స్, సర్వీసెస్ గురించి తెలపొచ్చు. అంతేకాదు... కస్టమర్ల షాపింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి ఫీడ్‌బ్యాక్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. వాట్సప్ బిజినెస్ యాప్‌లో కస్టమర్లు తమ ప్రొడక్ట్స్, సర్వీసెస్‌తో క్యాటలాగ్ రూపొందించొచ్చు. వాటిపై కస్టమర్ల సందేహాలను తీర్చడానికి ఆప్షన్స్ ఉంటాయి. కస్టమర్లకు ఏవైనా నోటిఫికేషన్స్ పంపాలన్నా ఈ యాప్ ద్వారా సాధ్యమే. వాట్సప్ బిజినెస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. వాట్సప్ బిజినెస్ యాప్‌లో ఆటోమేటెడ్ మెసేజెస్ ఫీచర్ కూడా ఉంది. వ్యాపారులు తమ అడ్రస్, బిజినెస్ డిస్క్రిప్షన్, ఇమెయిల్ అడ్రస్, వెబ్సైట్ లాంటి వివరాలతో బిజినెస్ ప్రొఫైల్ రూపొందించవచ్చు. అయితే వ్యాపారులకు మరిన్ని అవసరమైన సేవల్ని అందించేందుకు మెంబర్షిప్ ప్యాకేజీ రూపొందించబోతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. గతంలో వాట్సప్ బిజినెస్ యాప్‌లో లేని ఫీచర్స్‌ని సబ్స్క్రిప్షన్ ద్వారా ఉపయోగించవచ్చు. ఒకే వాట్సప్ నెంబర్‌తో 10 డివైజ్‌లను కనెక్ట్ చేయొచ్చు. ప్రతీ డివైజ్‌ను రీనేమ్ చేయడం ద్వారా సులువుగా గుర్తుంచుకోవచ్చు. ప్రస్తుతం నాలుగు డివైజ్‌లల్లో మాత్రమే ఒక వాట్సప్ నెంబర్ ఉపయోగించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. వాట్సప్ బిజినెస్ అకౌంట్ యూజర్లందరూ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం తప్పనిసరి కాదు. ప్రస్తుతం వాట్సప్ బిజినెస్ యాప్‌లో ఉన్న ఫీచర్స్ అన్నీ వారికి అందుబాటులో ఉంటాయి. అయితే అదనపు ఫీచర్స్ కావాలనుకునేవారు మాత్రం వాట్సప్ ప్రీమియం ఎంచుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ ద్వారా లభించే ఫీచర్స్ వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. వాట్సప్ బిజినెస్ యాప్ ప్రీమియం యూజర్లకు అందించే ఫీచర్స్ డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్‌లో లభిస్తాయి. యూజర్లకు మరిన్ని అద్భుతమైన ఫీచర్స్ అందించేలా వాట్సప్ కృషి చేస్తోంది. అయితే వాట్సప్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎంత ఉంటుంది? ఒకే ప్లాన్ ఉంటుందా? కస్టమర్లు ఎంత చెల్లించాలి అన్నది తెలియాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)