1. ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. అలానే అందరూ ఉపయోగించే కామన్ మెసేజింగ్ అప్లికేషన్‌గా వాట్సాప్ మారిపోయింది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగదారులు ఉపయోగిస్తున్న ఇన్స్టాంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్. ఈ యాప్‌కు ఇండియాలోనే అత్యధికంగా యూజర్లు ఉన్నారు. అయితే అందరూ ఎప్పుడో ఒకసారి వాట్సాప్‌లో పొరపాటును ఒకరికి పంపాల్సిన మెసేజ్ మరొకరి పంపేసి ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. సంబంధం లేని గ్రూప్‌లో అనుకోకుండా ఏదైనా పోస్ట్ చేసి ఉంటారు. వెంటనే తేరుకొని డిలీట్ చేసి ఉంటారు. వాట్సాప్ మెసేజ్‌ను డిలీట్ చేసే సమయంలో డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete For Everyone) ప్రెస్ చేయబోయి డిలీట్ ఫర్ మీ(Delete For Me) ప్రెస్ చేస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడేయడానికి వాట్సాప్ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేయనుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
3. మెటా యాజమాన్యంలో వాట్సాప్ కంపెనీ యూజర్ల అవసరాలకు తగినట్లు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది. పొరపాటున మెసేజ్‌లను సెండ్ చేసి డిలీట్ చేయడంలో తికమక పడి.. ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోకుండా రక్షించనుంది. డిలీట్ ఫర్ ఎవ్రీవన్కి బదులుగా డిలీట్ ఫర్ మీ ఆప్షన్ ప్రెస్ చేసినప్పుడు.. ఆ యాక్షన్‌ను UNDO చేయడానికి వాట్సాప్ వీలు కల్పించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ కొత్త ఫీచర్ కొన్ని iPhone, Android డివైజ్‌లలో పరికరాల్లో అందుబాటులోకి వచ్చింది. US-బేస్డ్ టెక్ పోర్టల్ TechCrunch నివేదిక ప్రకారం.. ఈ ఫీచర్ పర్సనల్, గ్రూప్ చాట్లలో కూడా పని చేస్తుంది. WABetaInfo వివరాలను ప్రస్తావిస్తూ.. ఆగస్ట్‌లో ఈ పీచర్‌ను కొన్ని Android, iOS డివైజ్‌లలో బీటా టెస్టింగ్ చేసినట్లు TechCrunch వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)