2. వాట్సప్ సెప్టెంబర్‌లో 22 లక్షల అకౌంట్స్‌ని, ఆగస్టులో 20.7 లక్షల అకౌంట్లను, జూన్ 16 నుంచి జూలై 31 మధ్య 30 లక్షలకు పైగా అకౌంట్స్‌ని బ్లాక్ చేసింది. ఆ యూజర్లందరూ ఇక వాట్సప్ అకౌంట్ ఉపయోగించడానికి వీల్లేదు. మళ్లీ వాట్సప్ యాప్ ఇన్స్టాల్ చేసినా అకౌంట్ లాగిన్ చేయడం సాధ్యం కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ యాప్స్‌లో స్టేస్ హైడ్ చేయడం, లిమిట్ లేకుండా ఫోటోస్ పంపడం, వాట్సప్ లిమిట్‌తో సంబంధం లేకుండా గ్రూప్స్ క్రియేట్ చేయడం లాంటి ఫీచర్స్ ఉంటాయి. అందుకే ఇలాంటి మోడిఫికేషన్ వర్షన్స్ని యూజర్లు ఉపయోగిస్తుంటారు. ఆన్లైన్లో లభించే వాట్సప్ మోడిఫికేషన్ వర్షన్స్ ఉపయోగిస్తే యూజర్లు రిస్కులో పడ్డట్టే. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ యాప్స్ ఉపయోగించకూడదని వాట్సప్ యూజర్లను అలర్ట్ చేసింది. అయినా ఇప్పటికీ ఈ యాప్స్ ఉపయోగిస్తున్నవారు ఉన్నారు. ఇలా వాట్సప్ మోడిఫికేషన్ వర్షన్స్ ఉపయోగిస్తున్న యూజర్లను గుర్తించి ప్రతీ నెలా వారి అకౌంట్లను బ్లాక్ చేస్తోంది వాట్సప్. ఈ తప్పు చేయడం వల్ల లక్షలాది మంది యూజర్లు ప్రస్తుతం వాట్సప్ వాడలేకపోతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8. వాట్సప్ అకౌంట్ బ్లాక్ కాకుండా కొన్ని టిప్స్ పాటించాలి. మీరు కూడా వాట్సప్ ప్లస్, జీబీ వాట్సప్, వాట్సప్ మోడ్ లాంటి అనధికార యాప్స్ ఇన్స్టాల్ చేసి వాటిని వాడుతున్నట్టైతే వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి. లేకపోతే మీ వాట్సప్ అకౌంట్ కూడా బ్లాక్ కావొచ్చు. అంతేకాదు... మీరు ఎక్కువగా ఫార్వర్డ్ మెసేజెస్ పంపుతున్నా మీ అకౌంట్‌ని వాట్సప్ బ్లాక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఇక మిమ్మల్ని ఎక్కువ మంది వాట్సప్‌లో బ్లాక్ చేసినా మీ వాట్సప్ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. యూజర్లు వాట్సప్‌లో ఆటోమేటెడ్, బల్క్ మెసేజింగ్, స్పామ్ మెసేజింగ్ చేసినా వారి వాట్సప్ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. ఒకవేళ మిమ్మల్ని వాట్సప్ తాత్కాలికంగా బ్లాక్ చేస్తే అన్‌బ్లాక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
10. ఇందుకోసం మీరు వాడుతున్న అనధికార వాట్సప్ అకౌంట్‌ను డిలిట్ చేయాల్సి ఉంటుంది. మీ అకౌంట్ రీస్టోర్ అయిన తర్వాత మీరు మళ్లీ అదే తప్పు చేస్తే మళ్లీ అకౌంట్ బ్లాక్ కావొచ్చు. ఈసారి శాశ్వతంగా అకౌంట్‌ను బ్లాక్ చేస్తుంది వాట్సప్. బ్లాక్ అయిన మీ వాట్సప్ అకౌంట్‌ను రీస్టోర్ చేయాలంటే వాట్సప్ సపోర్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. మీ అకౌంట్‌ను రివ్యూ చేసిన తర్వాత యాక్టివేట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)