1. మెటాకు చెందిన వాట్సప్ (WhatsApp) ప్రతీ నెలా లక్షల అకౌంట్స్‌ని బ్యాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2022 జనవరిలో 18.58 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది. భారతీయ ఐటీ నియమనిబంధనల ప్రకారం వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి వాట్సప్ ప్రతీ నెలా గ్రీవెన్స్ రిపోర్ట్ పబ్లిష్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రిపోర్ట్‌లో ప్రతీ నెల ఎన్ని అకౌంట్స్ బ్యాన్ చేసిందో వాట్సప్ వివరిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. వాట్సప్ యూజర్ల నుంచి ఫిర్యాదుల విభాగానికి వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా అకౌంట్స్‌ని బ్యాన్ చేసింది. దీంతో పాటు చట్టాన్ని ఉల్లంఘించేవారిని నిరోధించడానికి, గుర్తించడానికి వాట్సప్ సొంత యంత్రాంగం కూడా నిరంతరం పనిచేస్తోంది. దీంతో 2022 జనవరిలో మొత్తం 18.58 లక్షల అకౌంట్లను నిషేధించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. వాట్సప్‌కు 495 భారతీయ అకౌంట్ల నుంచి 285 అకౌంట్స్ బ్యాన్ చేయాలన్న ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 24 అకౌంట్స్‌ని బ్యాన్ చేసింది. మరోవైపు వాట్సప్ రూపొందించిన పలు రీసోర్సెస్, టూల్స్ ద్వారా హానికరమైన ప్రవర్తనను గుర్తించి 2022 జనవరి 1 నుంచి జనవరి 31 వరకు 18.58 లక్షల అకౌంట్లను నిషేధించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. వాట్సప్ ఇలా అకౌంట్స్‌ని నిషేధించడం ఇదే మొదటి సారి కాదు. 2021 మే 15 నుంచి జూన్ 15 మధ్య 20,11,000 అకౌంట్లు, జూన్ 16 నుంచి జూలై 31 మధ్య 30,27,000 అకౌంట్లు, ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు 30,27,000 అకౌంట్లు, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 22,09,000 అకౌంట్లు, అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు 20,69,000 అకౌంట్లు, నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు 17,59,000 అకౌంట్లు, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 20,79,000 అకౌంట్లపై నిషేధం విధించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. యూజర్లు ఏ యాప్ ఉపయోగించాలన్నా కొన్ని నియమనిబంధనలు ఉంటాయి. వాటిని ఉల్లంఘిస్తే నిషేధం తప్పదు. మరోవైపు భారత ప్రభుత్వం ఐటీ రూల్స్ 2021 రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ నిబంధనల ప్రకారం యూజర్లపై నిరంతర నిఘా ఉంటుంది. కాబట్టి వాట్సప్ యూజర్లు ఈ యాప్ ఉపయోగించే విషయంలో తప్పులు చేస్తే అకౌంట్ బ్యాన్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. వాట్సప్‌లో ఎక్కువగా మెసేజెస్ ఫార్వర్డ్ చేయడం, అభ్యంతరకరమైన పోస్టులు చేయడం, ఒకే అకౌంట్‌పై పదేపదే ఫిర్యాదులు రావడం, డజన్లకొద్దీ గ్రూపుల్ని క్రియేట్ చేయడం, వేలాది మంది యూజర్లను గ్రూప్‌లో యాడ్ చేయడం లాంటి చర్యలతో యాప్‌ను దుర్వినియోగం చేస్తున్నారని వాట్సప్‌కు సిగ్నల్స్ అందుతాయి. ఇలాంటి అకౌంట్లను వాట్సప్ నిషేధిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)