పాపులర్ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫారం వాట్సాప్ (WhatsApp) వరుస అప్డేట్లతో దూసుకెళ్తోంది. వినియోగదారుల కోసం అన్ని విభాగాలను మెరుగుపరుస్తోంది. అడ్వాన్స్డ్ ఆప్షన్లను అందిస్తోంది. ఇప్పుడు గ్రూప్ అడ్మిన్లు, సాధారణ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్లను ప్రకటించింది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఛానెల్ ద్వారా ఈ అప్డేట్ను షేర్ చేశారు.
* వాట్సాప్ గ్రూప్‌పై అడ్మిన్లకు కంట్రోల్ : గ్రూప్‌ల అడ్మిన్లకు ప్రైవసీ కోసం మెరుగైన కంట్రోల్స్‌ను అందిస్తోంది. దాని కోసం మెసేజింగ్ యాప్‌లోకి ఎవరు జాయిన్ అవ్వచ్చు అనే అంశాన్ని నిర్ణయించడానికి కొత్త టూల్‌ను యాడ్ చేయనుంది. గ్రూప్ ఇన్వైట్ లింక్‌లను క్రియేట్ చేసి, వాటిని అడ్మిన్లు గ్రూప్‌లో అందుబాటులో ఉంచవచ్చు. ఇప్పుడు అడ్మిన్లు గ్రూప్‌లో ఎవరు చేరవచ్చు, ఎవరు చేరకూడదని నిర్ణయించగలరు.
* వాట్సాప్ గ్రూపులకు ఎక్కువ సభ్యులను యాడ్ చేయవచ్చు : వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయగల సభ్యుల సంఖ్యను కంపెనీ రెట్టింపు చేసింది. ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్‌లో 512 మంది సభ్యులు ఉండవచ్చు. అయితే ఇప్పుడు మెసేజింగ్ యాప్ 1024 మంది సభ్యులకు సపోర్ట్ చేస్తుంది. గతేడాదే ఈ ఫీచర్ గురించి వాట్సాప్ ప్రకటించినా.. ఇప్పుడు అందుబాటులోకి తీసుకొస్తోంది.
* కామన్ గ్రూప్ మెంబర్లు : ఇప్పుడు వాట్సాప్ గ్రూప్‌ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఒక వినియోగదారులు ఒకటికి మించిన గ్రూప్‌లలో మెంబర్‌గా ఉంటున్నారు. ఈ గ్రూప్‌లలో ఏదైనా మ్యూచువల్గా ఉంటే ట్రాక్ చేయడం కష్టం. అయితే ఇప్పుడు కామన్ గ్రూప్‌లను కాంటాక్ట్ నేమ్ ద్వారా సెర్చ్ చేయవచ్చని వాట్సాప్ కంపెనీ పేర్కొంది. ఈ విధంగా గ్రూప్‌లో చేరవచ్చా? లేదా? అని నిర్ణయించుకోవచ్చు.
దీనికి సంబంధించి WABetaInfo చేసిన పోస్ట్‌లో..‘ఈ ఫీచర్ ఇంకా డెవలప్మెంట్లో ఉంది. కానీ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న వాట్సాప్ బీటా, ఆండ్రాయిడ్ 2.23.7.3 అప్డేట్ ద్వారా పిన్ చేసిన మెసేజ్ ఎలా కనిపిస్తుందో చూడవచ్చు. ఫీచర్ పూర్తిగా డెవలప్ అయిన తర్వాత వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.’ అని పేర్కొంది.
వాట్సాప్‌లోని గ్రూప్‌లు గత కొన్ని నెలలుగా చాలా ఫీచర్లను అందుకున్నాయి. గ్రూప్ సపోర్ట్ చేసే సభ్యుల సంఖ్య పెరిగింది. ఇతర సభ్యులు గ్రూప్‌లో చేసిన మెసేజ్‌లను అడ్మిన్లు తొలగించే సదుపాయం ఉంది. లేటెస్ట్ వాట్సాప్ ఫీచర్లు రాబోయే వారాల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైజ్‌లు రెండింటికీ అప్డేట్స్ అందే అవకాశం ఉంది.