WhatsApp: గుడ్ న్యూస్... వాట్సప్‌లో మీరు ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేసింది
WhatsApp: గుడ్ న్యూస్... వాట్సప్‌లో మీరు ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేసింది
WhatsApp | మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నారా? మీ వాట్సప్‌లో ముఖ్యమైన ఫైల్స్ సేవ్ చేసుకున్నారా? వాటిని వెతకలేకపోతున్నారా? సరికొత్త ఫీచర్ వచ్చింది. ఆ ఫీచర్ ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.
1. వాట్సప్ యూజర్లకు శుభవార్త. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని అందించే వాట్సప్... మరో అద్భుతమైన ఫీచర్ రిలీజ్ చేసింది. అడ్వాన్స్డ్ సెర్చ్ ఫీచర్‌ను అందిస్తోంది వాట్సప్. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. కంప్యూటర్లో అయినా, స్మార్ట్‌ఫోన్‌లో అయినా ఫైల్స్ వెతకాలంటే సెర్చ్ ఆప్షన్ ఉపయోగిస్తాం. వాట్సప్‌లో కూడా సెర్చ్ ఆప్షన్ ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. సెర్చ్ ఆప్షన్ని మరింత అడ్వాన్స్డ్గా మార్చింది వాట్సప్. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ మెసేజెస్, ఫోటోలు డాక్యుమెంట్స్, ఆడియో, వీడియో ఫైల్స్ సులువుగా సెర్చ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. వాట్సప్‌లో సెర్చ్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ఫైల్‌కు సంబంధించిన పదాన్ని లేదా కీవర్డ్‌ని టైప్ చేయాలి. ఒకవేళ అదే ఫైల్ పేరుతో ఎక్కువ ఫైల్స్ ఉంటే మీకు ఫిల్టర్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. ఉదాహరణకు మీరు పాన్ కార్డ్ కోసం PAN CARD అని టైప్ చేశారనుకుందాం. ఆ పేరుతో ఇతర ఫైల్స్, మెసేజెస్ ఉన్నా అన్నీ కనిపిస్తాయి. కానీ మీకు కేవలం ఆ డాక్యుమెంట్ మాత్రమే కావాలనుకుంటే ఫిల్టర్‌లో డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేస్తే చాలు. మీ పాన్ కార్డ్ డాక్యుమెంట్ తప్ప ఇతర ఫైల్స్ కనిపించవు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. ఫోటోలు, వీడియోలు, లింక్స్, Gifs, ఆడియో, డాక్యుమెంట్స్‌కు ఇలాగే ఫిల్టర్స్ ఉపయోగించి మీకు కావాల్సిన ఫైల్స్ సులువుగా వెతకొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. అడ్వాన్స్డ్ సెర్చ్ ఫీచర్ వల్ల వాట్సప్‌లోని ఫైల్స్ సులువుగా, వేగంగా సెర్చ్ చేసే అవకాశం లభిస్తుంది యూజర్లకు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. ఇక వాట్సప్ ఇటీవల మరిన్ని ఫీచర్స్ రిలీజ్ చేసింది. ఒకే వాట్సప్ అకౌంట్‌తో నాలుగు డివైజ్‌లలో లాగిన్ కావొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)