1. టొయోటా గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీతో రూపొందించిన మిరాయ్ కారులో నితిన్ గడ్కరీ (Nitin Gadkari) పార్లమెంట్‌కు వచ్చారు. ఇది హైడ్రోజన్ బేస్డ్ ప్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికిల్ (FCEV). ఇంధన ట్యాంక్ నుంచి హైడ్రోజెన్, ఇంటేక్ గ్రిల్ నుంచి లోపలికి వెళ్లే గాలి కలిసి ఇంధనంగా మారుతుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
2. ఈ కారు విద్యుత్తుతో నడుస్తుంది. చివరగా నీరు ఉత్పత్తి అవుతుంది. అందుకే దీన్ని 'జీరో కార్బన్ ఎమిషన్' కారు అని పిలుస్తారు. ఈ కారుతో పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. అయితే ఇప్పటికే మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఈ కారు కూడా ఎలక్ట్రిసిటీతోనే నడుస్తుంది. మరి తేడా ఏంటీ? అన్న సందేహాలు ఉన్నాయి. (image: Toyota)
3. ఇందులో ఎలక్ట్రిసిటీ హైడ్రోజన్ సాయంతో తయారవుతుంది. ఎలక్ట్రిక్ కారును ఫుల్ ఛార్జింగ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఐదారు గంటలైనా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. కానీ హైడ్రోజన్ కారులోని ఫ్యూయెల్ ట్యాంకును కేవలం 5 నిమిషాల్లో ఫిల్ చేయొచ్చు. హైడ్రోజన్‌ను తయారు చేయడానికి ఉపయోగించే శక్తి నుంచి హైడ్రోజన్ కారును నడపడానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి వరకు చాలా శక్తి వృధా అవుతుంది. (image: Toyota)
4. సాంప్రదాయకంగా పనిచేసే హైడ్రోజన్ ఆధారిత ఇంధన కణ వ్యవస్థ కేవలం 38 శాతం సమర్థవంతమైనదిగా పరిగణించబడుతుంది. విద్యుత్తును నేరుగా వినియోగించే వాహనాలు 80 శాతం ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ విషయంలో ఎలక్ట్రిక్ కారుదే పైచేయి. పెర్ఫామెన్స్ పరంగా చూస్తే హైడ్రోజన్ కారు కాస్త వెనుకబడే ఉంది. (image: Toyota)
5. ఉదాహరణకు ఇతర కార్లతో పోలిస్తే టాప్ స్పీడ్ అందుకోవడానికి హైడ్రోజన్ కారుకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో పాటు హైడ్రోజన్ బేస్డ్ ప్యూయెల్ సెల్ కారు ధర కూడా కాస్త ఎక్కువ. నితిన్ గడ్కరీ ఉపయోగించిన టొయోటా మిరాయ్ కారు ధర రూ.37 లక్షలు. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 650 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. (image: Toyota)
7. ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోతున్నాయి. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టిగార్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మహీంద్రా ఇవెరిటో లాంటి మోడల్స్ మార్కెట్లో ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని కార్లను కంపెనీలు రిలీజ్ చేయబోతున్నాయి. మరి వీటి పోటీని గ్రీన్ హైడ్రోజన్ కార్ తట్టుకుంటుందో లేదో చూడాలి. (image: Toyota)