1. ప్రస్తుతం అందరికీ ప్రత్యేక డిజిటల్ లైఫ్ ఉంటుంది. అందులో సందేహం లేదు. డిజిటల్ ప్రపంచంలో మీ ఇమెయిల్ అకౌంట్లు, క్లౌడ్ స్టోరేజీ, సోషల్ అకౌంట్స్ ఇలా అనేక ప్లాట్‌ఫామ్స్‌లో మీ పర్సనల్ డేటా ఉంటుంది. అందులో మీ వ్యక్తిగత వివరాలు, ఆర్థిక వివరాలు, ప్రైవేట్ వ్యవహారాలు... ఇలా సమస్త సమాచారం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎవరైనా చనిపోయాక వారి డేటా మొత్తం ఏం కావాలి? ఎవరి చేతుల్లోకి వెళ్లాలి? అసలు ఆ డేటా ఉండాలా వద్దా? ఆ డేటాను యాక్సెస్ చేయడానికి ఎవరికైనా అనుమతి ఇవ్వాలా? ఇలాంటివన్నీ మీరు ముందే నిర్ణయించుకోవచ్చు. మీ ఆస్తులకు వారసుల్ని, మీ డబ్బులకు నామినీలను ఎంపిక చేసినట్టే డిజిటల్ ప్రపంచంలోని మీ డేటాను ఎవరి చేతికి ఇవ్వాలో కూడా మీరు ముందే నిర్ణయించొచ్చు. సంస్థను బట్టి నిబంధనలు మారుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Google: మీరు ఏ డేటాను ట్రాన్స్ఫర్ చేయాలో కూడా కస్టమైజ్ చేయొచ్చు. మీరు చెప్పినవారికి డేటా వెళ్లిన తర్వాత మూడు నెలల్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ అకౌంట్ డిలిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ఫీచర్ యాక్టివేట్ చేయకపోతే ఎలా అన్న అనుమానం రావొచ్చు. మీరు చనిపోయిన తర్వాత మీ డేటాను కోరుతూ మీ కుటుంబ సభ్యులు గూగుల్‌కు దరఖాస్తు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)