1. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను, అప్డేట్స్ తీసుకొస్తోంది షార్ట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ (WhatsApp). యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచడానికి త్వరలో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకురానుంది. వాట్సాప్ గ్రూప్‌లో పెట్టే మెసేజ్‌లను డిలీట్ చేయడానికి గ్రూప్ అడ్మిన్లకు (Group Admin) యాక్సెస్ ఇచ్చే ఫీచర్‌ను ఈ మెసేజింగ్ యాప్ తీసుకురానుందట. (ప్రతీకాత్మక చిత్రం)
2. దీని ద్వారా టైమ్, కౌంట్‌తో సంబంధం లేకుండా గ్రూప్ అడ్మిన్లు మెసేజ్‌లను డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గ్రూపులో ఉండే ప్రతి ఒక్కరూ మెసేజ్‌ను చదవకముందే అడ్మిన్ దాన్ని డిలీట్ చేయవచ్చు. ఈ విషయాన్ని వాట్సాప్ ట్రాకర్ Wabetainfo ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. గ్రూపులోని మెసేజ్‌లను డిలీట్ చేసే సదుపాయం ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో రానుందని పోస్ట్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. "మీరు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అయితే, ఒక గుడ్ న్యూస్. ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ బీటా త్వరలో కొత్త అప్డేట్ తో రానుంది. గ్రూపులో మెంబర్స్ పోస్ట్ చేసే మెసేజ్‌లను అందరికీ కనిపించకుండా డిలీట్ చేసే (Delete for every one) ఫీచర్‌ను వాట్సాప్ బీటా వెర్షన్ తీసుకురానుంది" అని ట్వీట్లో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ షేర్ చేసిన పోస్ట్ ప్రకారం ఈ అవకాశం గ్రూప్ అడ్మిన్‌కు మాత్రమే ఉంటుంది. ఎవరైనా చేసిన మెసేజ్‌ను అడ్మిన్ డిలీట్ చేసిన తర్వాత.. ‘This was deleted by an admin’ అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఏ అడ్మిన్ ఆ మెసేజ్‌ను డిలీట్ చేశారో కూడా ఇతర గ్రూప్ మెంబర్స్‌కు తెలిసిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. కొన్నిరోజుల క్రితం "డిలీట్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్" ఫీచర్ కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు వాట్సాప్ పేర్కొంది. ప్రస్తుతం వినియోగదారులు మెసేజ్ సెండ్ చేసిన ఓ గంట, 8 నిమిషాలు, 16 సెకన్లు తర్వాత మాత్రమే దాన్ని అందరికీ కలిపి డిలీట్ చేసే అవకాశముంది. త్వరలో యూజర్లు.. తాము పంపిన మెసేజ్‌లను ఏడు రోజుల తర్వాత ప్రతి ఒక్కరికీ డిలీట్ చేసే ఆప్షన్‌ను పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. వీటితో పాటు మరిన్ని ఫీచర్స్ త్వరలోనే రిలీజ్ కానున్నాయి. వాట్సప్ గ్రూప్స్‌ని కలుపుతూ కమ్యూనిటీ ఫీచర్, నోటిఫికేషన్లో కూడా ప్రొఫైల్ ఫోటో కనిపించడం, వాట్సప్‌లో లాస్ట్ సీన్ కొందరికి మాత్రమే కనిపించేలా చేయడం, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్టు వాట్సప్‌లో కూడా లాగౌట్ ఆప్షన్ తీసుకురావడం... ఇలే అనేక కొత్త ఫీచర్స్ రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)