1. భారతదేశంలో వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు భాషల్ని మాట్లాడుతుంటారు. అనేక భాషలు, సంస్కృతుల సంగమం భారతదేశం. వ్యాపారం, ఉద్యోగం, టూరిజం కోసం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేవారు అక్కడి భాష తెలియకుండా ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు కొత్త భాష నేర్చుకోవడం కోసం భాషా సంగం (Bhasha Sangam) రూపొందించింది భారత ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ యాప్ ద్వారా యూజర్లు కొత్త భాషను ఆన్లైన్లోనే నేర్చుకోవచ్చు. ఒకేసారి రెండుమూడు భాషలు కూడా నేర్చుకోవచ్చు. ఈరోజుల్లో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారికి అక్కడి భాష కొంతైనా తెలియాల్సి వస్తుంది. అలాంటివారు కోచింగ్ అవసరం లేకుండా ఈ యాప్లో సులువుగా భారతీయ భాషల్ని నేర్చుకోవచ్చు. లైవ్ క్లాసెస్ ద్వారా భారతీయ భాషల్ని నేర్చుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ యాప్ ఉచితం. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉచితంగా 22 భారతీయ భాషల్ని సులువుగా నేర్చుకోవచ్చు. కేంద్ర విద్యా శాఖ, మైగవ్ ఇండియా #EkBharatShreshthaBharat కార్యక్రమంలో భాగంగా కొత్త భాషలు నేర్చుకోవాలనుకునేవారి కోసం యాప్స్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మల్టీభాషీ యాప్ ఉంది. ఇప్పుడు భాషా సంగం యాప్ను రూపొందించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. భాషా సంగం మొబైల్ యాప్లో 22 భారతీయ భాషల్ని నేర్చుకోవచ్చు. ఇందులో తెలుగుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మళయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, తమిళ్, సింధి, ఉర్దూ, బోడో, సంథలి, మైథిలి, డోగ్రీ భాషల్ని నేర్చుకోవచ్చు. రోజూవారీ సంభాషణల కోసం సాధారణంగా ఉపయోగించే వాక్యాలు నేర్చుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. భాషాపరంగా ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు ఉండవు. భాషా సంగం మొబైల్ యాప్ ఫీచర్స్ చూస్తే ఇందులో పాఠాలన్నీ గేమ్ రూపంలో ఉంటాయి. గేమ్ ఆడుతూ పాఠాలు పూర్తి చేయొచ్చు. యూజర్లు లెవెల్స్ సెలెక్ట్ చేసి అందులోని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉండాలి. రోజూ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. యూజర్లు కొత్త భాషను సులువుగా నేర్చుకోవడానికి ఇమేజెస్ కూడా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. భారతదేశంలోని వేర్వేరు సంస్కృతుల గురించి తెలియజేసేందుకు 44 సరికొత్త క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. 500 పైగా కల్చరల్ టిప్స్ ద్వారా వేర్వేరు సంస్కృతులను తెలుసుకోవచ్చు. ఈ యాప్లో పైన వెల్లడించిన భాషలకు ప్రతీ ప్రశ్నకు ఇన్స్టంట్ ఫీడ్బ్యాక్ లభిస్తుంది. కొత్త భాష ఎంత నేర్చుకున్నామో తెలుసుకోవడానికి ప్రోగ్రెస్ ట్రాక్ చేయొచ్చు. స్కోర్ కూడా డిస్ప్లే అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో ఉచితంగా డౌన్లోడ్ చేయొచ్చు. ప్లేస్టోర్లో 50,000 కన్నా ఎక్కువసార్లు డౌన్లోడ్ చేయడం విశేషం. Multibhashi - Learn English డెవలపర్ పేరుతో భాషా సంగం మొబైల్ యాప్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)