1. వాట్సప్ యూజర్లకు ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ని (WhatsApp Features) దూకుడుగా అందిస్తోంది మెటా. వాట్సప్ యూజర్లు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న వాట్సప్ కమ్యూనిటీస్ (WhatsApp Communities) ఫీచర్‌ను ఇటీవల రిలీజ్ చేసిన మెటా, ఆ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను రోల్ ఔట్ చేస్తున్నట్టు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. వాట్సప్ గ్రూప్స్‌లో పోల్స్ ఫీచర్‌ని (Whatsapp Polls Feature) పరిచయం చేసింది. ఏదైనా అంశంపై గ్రూప్‌లో పోల్ నిర్వహించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సప్ యూజర్లు తమ యాప్‌ను అప్డేట్ చేసి గ్రూప్స్‌లో పోల్స్ ఫీచర్ ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ వాట్సప్ గ్రూప్స్‌లో మాత్రమే ఉపయోగించగలరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. వాట్సప్ పోల్స్ ఫీచర్‌ని గ్రూప్‌లోని సభ్యులు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. తాము ఉన్న గ్రూప్‌లో పోల్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఈ ఫీచర్ కేవలం గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే కాదు. గ్రూప్ సభ్యులు కూడా పోల్ క్రియేట్ చేసే అవకాశం కల్పిస్తోంది మెటా. ఏదైనా ఒక అంశంపై గ్రూప్ సభ్యుల అభిప్రాయం తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. పోల్ క్రియేట్ చేస్తే 12 ఆప్షన్స్ ఉంటాయి. యూజర్లు తమకు కావాల్సిన ఆప్షన్స్ సెట్ చేయొచ్చు. గ్రూప్‌లో పోల్ క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్ మెంబర్స్ తమకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. ఆ పోల్‌లో ఎన్ని ఓట్లు వచ్చాయన్నది వెంటనే తెలిసిపోతుంది. మరి వాట్సప్ గ్రూప్‌లో పోల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ముందుగా వాట్సప్‌లో మీరు పోల్ క్రియేట్ చేయాలనుకుంటున్న గ్రూప్ ఓపెన్ చేయండి. అటాచ్ బటన్ పైన క్లిక్ చేయండి. Poll పైన క్లిక్ చేయండి. Question లో మీరు అడగాలనుకుంటున్న ప్రశ్న టైప్ చేయండి. ఆప్షన్స్‌లో మీరు ఇవ్వాలనుకుంటున్న ఆప్షన్స్ టైప్ చేయండి. ఆప్షన్స్ టైప్ చేసిన తర్వాత సెండ్ బటన్ పైన క్లిక్ చేయండి. గ్రూప్‌లో పోల్ క్రియేట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆ తర్వాత గ్రూప్ సభ్యులు ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తారు. ఏ ఆప్షన్‌కు ఎన్ని వోట్లు వచ్చాయో కూడా తెలుస్తుంది. గ్రూప్‌లో ఎవరు ఏ ఆప్షన్ ఎంచుకున్నారో కూడా తెలుసుకోవచ్చు. View Votes పైన క్లిక్ చేస్తే ఏ ఆప్షన్‌కు ఎన్ని వోట్లు వచ్చాయో చూడొచ్చు. మెసేజ్ డిలిట్ చేసినట్టు పోల్ కూడా డిలిట్ చేయొచ్చు. డిలిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే Delete For Everyone, Delete For Me ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)