1. గ్లోబల్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐఫోన్ ఉండటాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు చాలామంది. అయితే అధిక ధర కారణంగా ఐఫోన్లను కొనలేక చాలామంది ఇతర డివైజ్‌లను వాడుతుంటారు. అయితే తక్కువ ధరకే ఐఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ ఆఫర్ కింద యాపిల్ ఐఫోన్ 12ను కేవలం రూ. 48,999 వద్ద అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. తద్వారా మరింత తగ్గింపు ధరతో ఐఫోన్ 12ను దక్కించుకోవచ్చు. ఐఫోన్ 12పై ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న లేటెస్ట్ ఆఫర్లతో పాటు డివైజ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను పరిశీలిద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఫోన్ 12 ఈ హ్యాండ్సెట్ 6.1- అంగుళాల OLED సూపర్ రెటినా XDR డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ ప్లే సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రోటక్షన్ తో వస్తుంది. యాపిల్ A14 బయోనిక్ చిప్సెట్తో పనిచేస్తుంది. ఇది iOS 14పై రన్ అవుతుంది. ఈ చిప్ సెట్ సరికొత్త iOS 16 సాఫ్ట్వేర్ అప్డేట్తో వస్తుంది. న్యూ స్క్రీన్ లాక్, బ్యాటరీ ఇండికేషన్ వంటి లేటెస్ట్ ఫీచర్లను అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. డస్ట్, వాటర్ రెసిస్టెంట్కు మద్దతిస్తుంది. ఐఫోన్ 12 వెనుక వైపు రెండు 12MP సెన్సార్లతో కూడిన డ్యూయల్ కెమెరా సెన్సార్ ను అందించింది. దీని ముందు భాగంలో సెల్ఫీల కోసం 12MP కెమెరాను చేర్చింది. ఇది 17 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ ను అందించగలదు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 64GB స్టోరేజ్ మోడల్ రూ.10,901 డిస్కౌంట్‌తో లభిస్తుంది. దీనికి అదనంగా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లతో రూ.1,500 వరకు 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు మరో 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఒకవేళ, మీరు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే.. ఐఫోన్ 12 కొనుగోలుపై గరిష్టంగా రూ.17,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈజీ ఈఎంఐ ఆప్షన్ ద్వారా కేవలం నెలకు రూ.1,675 చెల్లించి ఐఫోన్ 12ను దక్కించుకోవచ్చు. అందువల్ల, మీరు మీ పాత ఫోన్ నుండి కొత్త ఫోన్‌కు మారాలనుకుంటే ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)