1. అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day Sale) ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సేల్ ముగిసినా స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ స్మార్ట్ఫోన్లపైనా ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ (Apple iPhone XR) స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.17,599 ధరకే సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.15,400 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. దీంతో పాటు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.15,400 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తే బ్యాంక్ ఆఫర్స్ కలిపి రూ.34,999 విలువైన ఐఫోన్ ఎక్స్ఆర్ 64జీబీ వేరియంట్‌ను రూ.17,599 ధరకే సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఐఫోన్ ఎక్స్ఆర్ 128జీబీ వేరియంట్ పైనా ఈ ఆఫర్ ఉంది. రూ.40,999 విలువైన ఐఫోన్ ఎక్స్ఆర్ 128జీబీ వేరియంట్‌ను రూ.23,599 ధరకు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ పే రివార్డ్, అమెజాన్ పే బ్యాలెన్స్, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. వీటి ద్వారా లావాదేవీలు చేస్తే క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. యాపిల్ ఏ12 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 64జీబీ, 128జీబీ వేరియంట్లో లభిస్తుంది. ఐఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఐఓఎస్ 14 లో రీడిజైన్డ్ విడ్జెట్స్, సరికొత్త యాప్ లైబ్రరీ, యాప్ క్లిప్స్ లాంటి మార్పులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఐఫోన్ ఎక్స్ఆర్ స్మార్ట్‌ఫోన్‌లో 12మెగాపిక్సెల్ సింగిల్ వైడ్ కెమెరా మాత్రమే ఉంది. పోర్ట్రైట్ మోడ్, పోర్ట్రైట్ లైటింగ్, డెప్త్ కంట్రోల్, స్మార్ట్ హెచ్డీఆర్, 4కేవీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 7మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో కూడా పోర్ట్రైట్ మోడ్, పోర్ట్రైట్ లైటింగ్, డెప్త్ కంట్రోల్ ఫీచర్స్‌తో పాటు 1080p వీడియో ఫీచర్ ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)